సీఎంను కలిసే అవకాశం తనకు రాలేదని పంచకర్ల చెప్పడం అబద్ధం : సుబ్బారెడ్డి

వచ్చే వారం జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని వెల్లడి

panchakarla-ramesh-babu-resignation-is-not-good-says-yv-subba-reddy

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపికి, ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో జరుగుతున్న పరిణామాలకు మనస్థాపం చెంది ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి కీలక నేత, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ… ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం తనకు రాలేదని పంచకర్ల అనడం అబద్ధమని చెప్పారు. సీఎంను కలవాలనే విషయం తనతో చెపితే తప్పకుండా ఆ విషయంలపై చర్చించేవారమని అన్నారు. ఆయన రాజీనామా తొందరపాటు చర్య అని చెప్పారు. ఏదైనా తనతో చర్చిస్తే బాగుండేదని అన్నారు. రమేశ్ కు జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవించామని తెలిపారు. వచ్చే వారం జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని వెల్లడించారు.