సామజవరగమన.. అలా పుట్టింది: అల్లు అర్జున్‌

Actor Allu Arjun

సంక్రాంతి చిత్రాల్లో ఒకటైన ‘అల వైకుంఠపురములో ఈనెల 12న (ఆదివారం) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.. బన్నీ-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావటంతో ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీకి సమయం దగ్గరపడటంతో చిత్రం యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూన్నరు. కాగా శనివారం అల్లు అర్జున్‌తో ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం.

సామజవరగమన.. సాంగ్‌ ఎలా పుట్టింది?
దీనికి చిన్న హిస్టరీ ఉంది (నవ్వు), ఖాళీగా ఉన్న రోజుల్లో..అంటే గతరెండేళ్లలో బ్యాండ్‌ కల్చర్‌ బాగా పెరిగింది.వీటికి నా భార్య చాలాసార్లు పిలిచేది.. ఇన్నిసార్లు అడుగుతుందని ఓసారి వెళ్తే ఆ బ్యాండ్‌కు అందరి నుంచి ముఖ్యంగా యూత్‌ నుంచి మంచి స్పందన వచ్చింది.. ఇలా ప్రతిఒక్కరు గుర్తుంచుకునేలా , పాడుకునేలా ఓ సాంగ్‌ ఉండాలనుకున్నాను. అపుడు అనుకోకుండా ఈచిత్రంలో ఓ సీన్‌కు లవ్‌సాంగ్‌ పడాల్సిన సమయం వచ్చినపుడు తమన్‌కూడ ఈ బ్యాండ్‌ కల్చర్‌ గురించి చెప్పాడు. ఎలాంటి సాంగ్‌ అయితే అందరికీ నచ్చుతుంది. అందరూ ఇష్టపడుతున్నారో ఆ టెంపోలో మనం కూడ అలా చేద్దాం అని,. అలా త్రివిక్రమ్‌ గారు ఆ సామజవరగమన.. అనే లిరిక్‌ను అయనే క్రియేట్‌ చేసి తమన్‌తో ట్యూన్‌ చేసి నాకు విన్పించారు. అలా పుట్టింది ఈ సాంగ్‌..

సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో మీ నాన్నగారి గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు.?
ఈసినిమా స్క్రిప్టునకు ఆ రోజు ఆ సందర్భానికి సంబంధం లేదు.. నేను గంగోత్రి నుంచి దాదాపు20 సినిమాలు చేశాను.. వాటిలో ఏడెనిమిది నా తండ్రితోనే చేశాను.. అయితే మన కల్చర్‌లో ఒక తెలీని మొహమాటం ఉంటుంది.. మామూలుగా ఏవన్నా మంచి సినిమాలు తీసినపుడు మా నాన్నతతో ఒకరికొరం మంచి సినిమా చేశాం అని చెప్పుకునేవాళ్లం కానీ,, నేనెప్పుడూ మా నాన్నకు థ్యాంక్స్‌ చెప్పలేదు. ఆయన నాకు ఎన్నో లెక్కలేనన్ని చేశారు.. ఏదన్నా మంచి సందర్భం వచ్చినపుడు చెప్దాం అనుకున్నాను.. ఆ రోజు అంత ఎమోషనల్‌ అవుతానని నేను కూడ అనుకోలేదు.
ఆడియో విజువల్‌గా మంచి రెస్సాన్స్‌ వచ్చింది కదా.. చిరంజీవిగారి నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?
చిరంజీవిగారు ఇంకా సినిమా చూడలేదు.. విడుదల రోజు మధ్యాహ్నం చూస్తారు.అపుడు చెప్తారు. అలాగే ఈసినిమాలో చిరంజీవిగారిపై కొన్ని హైలెట్స్‌ కూడ ఉన్నాయి. అవి మీరు రేపు రిలీజ్‌ అయ్యాక థియేటర్‌లో చూస్తారు.

ఈసినిమాలో మీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రోల్‌ను బాగా ఎంజా§్‌ు చేస్తూ చేశారా?
మామూలుగా ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ రోల్స్‌ చెయ్యాలి అంటే చాలా సరదాగా మూడ్‌లో ఉండాలి .. ఎక్కువ బరువు తీసుకోకూడదు.. అంటే సీరియస్‌గా ఉండి..షాట్‌ అనగానే వచ్చి సరదాగా చేసి వెళ్లిపోతే ఆ షాట్‌ బాగా రాదు. అందుకే నేను కూడ అంత బరువు పెట్టుకోలేదు.. చాలా సరదాగా చేశాను.. నా రోల్‌ కూడ మంచి ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది.

మీ నుంచి మలయాళం స్రెయిట్‌ సినిమా వస్తుందా?
కచ్చితంగా ..నన్ను మలయాళ ఇండస్ట్రీ ప్రెస్‌వారు అడిగినపుడు కూడ అదే చెప్పా.. ఒకరిద్దరు మేకర్స్‌ వచ్చారు కానీ.. ఎక్కడో ఇద్దరికి స్క్రిప్టుపరంగా సెట్టవ్వట్టా.. చేస్తే ఏదన్నా మంచి సినిమానే చెయ్యాలి లేదంటే మన తెలుగు పరువు కూడ పోతుంది (నవ్వుతూ)

అల వైకుంఠపురములో కథను ఎంచుకోవటానికి కారణం?
నేను చేసిన గత మూడు చిత్రాలు సరైనోడు, డిజె, నాపేరు సూర్య.. ఇలా చాలా సీరియస్‌ కంటెంట్‌ కలిగినవి.. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ ఎమోషన్స్‌ కలిగిన చిత్రం ఒకటి చేయాలనుకున్నాను.. అందుకే అల వైకుంఠపురములో చిత్రాన్ని ఎంచుకున్నాను.
త్రివిక్రమ్‌తో ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు కారణం?
కొందరు హీరోలు దర్శకుల మధ్య ఒక రిధం కుదురుతుంది.. ఉదాహరణకు చెప్పాలంటే చిరంజీవి, కోదండరామిరెడ్డి కలిసి అప్పట్లో అనేక హిట్‌ సినిమాలు రూపొందించారు. అలాగే త్రివిక్రమ్‌ గారికి నాకు మధ్య మంచి రిధం కుదిరింది..

టైటిల్‌ అల వైకుంఠపురములో అని పెట్టటానికి కారణం?
ఈసినిమా వైకుంఠపురం అనే ఇంటిలోని సభ్యుల మధ్య నడుస్తుంది.. అందుకే అల వైకుంఠపురములో అనే టైటిల్‌ పెట్టాము.

ఈసినిమాలో మీపాత్ర ఎలా ఉంటుంది?
నేను సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా కన్పిస్తా.. పూజాహెగ్డే నా బాస్‌గా కన్పిస్తారు.. ఇక నా ఫాదర్‌గా చేసిన మురళికృష్ణ గారికి నాకు అస్సలు పడదు.

చాలా గ్యాప్‌ వచ్చింది.. మరి ఈ గ్యాప్‌లో ఏంచేశారు?
ఈ గ్యాప్‌ చాలా విషయాలు నేర్పింది.. ఏమి చేయాలి. ఏమి చేయకూడదు అనే,, అనేక విషయాలు తెలుసుకున్నాను.. అయితే నేను ఇంత పెద్ద విరామం తీసుకున్నా.. నా ఫ్యాన్స్‌ నన్ను ఎప్పుడూ ఫాలో అవుతూ.. ప్రతివిషయంలో సపోర్ట్‌చేశారు.. అందుకే అందరికీ ఫ్యాన్స్‌ ఉంటే నాకు ఆర్మీ ఉంది అని అన్నాను.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/