నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3

isro-launch-chandrayaan-3

సూళ్లూరుపేట: జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్‌-3’ బయలుదేరింది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్‌-3ని అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు ఈ ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ రాకెట్‌ చంద్రయాన్‌-3ని భూమి చుట్టూ ఉన్న 170X36,500 కి.మీ దీర్ఘవృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. ఇది 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతూ.. చంద్రుడి దిశగా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్‌-3ని పంపిస్తారు.