బిఆర్ఎస్ నేతలతో కెసిఆర్ భేటీ..ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దని వార్నింగ్

గ్రూపు వివాదాలను వీడాలని నేతలకు హెచ్చరిక

kcr-warning-to-brs-leaders

కామారెడ్డిః తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాసేపట్లో కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గజ్వేల్ లో ఉదయం నామినేషన్ వేసిన కెసిఆర్… అక్కడి నుంచి కామారెడ్డికి చేరుకున్నారు. కామారెడ్డిలో నేరుగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటికి వెళ్లారు. అక్కడ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. కామారెడ్డిలో ఇటీవల చోటుచేసుకున్న వివాదాలపై ఆయన ఆరా తీశారు. గ్రూపు తగాదాలను వీడాలని, అందరూ కలసికట్టుగా పని చేయాలని సూచించారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.