చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి ఫై ఉత్కంఠ..

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో ఏంజరుగుతుందో..ఎవరు ఉంటారో..ఎవరు ఉండడం లేదో..అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పుతో వైసీపీకి వరుస పెట్టి షాకులు తగులుతున్నాయి. టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలంతా వేరే పార్టీల్లోకి వెళ్తున్నారు. ఒకవేళ అదే పార్టీ లో ఉన్న కూడా వైసీపీ గెలుపు కోసం పనిచేస్తారో లేదో కూడా తెలియడం లేదు. ఈ తరుణంలో టికెట్ ఆశించిన నేతలు మాత్రం మాకే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా మల్లెల రాజేశ్ నాయుడు పోటీ చేస్తారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన్ను మారుస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. మరోసారి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ ప్రకటన తో మల్లెల రాజేశ్ నాయుడు తో పాటు ఆయన వర్గం సంబరాలు చేసుకుంటున్నారు.