ఫిబ్రవరి 20 నుంచి బీజేపీ ‘ప్రజా పోరు’

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటీకే వైసీపీ , టీడీపీ పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..బిజెపి , జనసేన మాత్రం సైలెంట్ గా ఉన్నాయ్. ఈ క్రమంలో ఫిబ్రవరి 20 నుంచి బీజేపీ ‘ప్రజా పోరు’ యాత్ర చేపట్టనున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఈ యాత్ర ద్వారా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. అలాగే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేసిన కృషిని వివరించనుంది. మరోవైపు వచ్చే నెల 9 నుంచి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లెకు పోదాం’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయనుంది.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ మాట్లాడుతూ..ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా‌ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వర్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ‘పల్లెకు పోదాం’ కార్యక్రమాన్ని చేపట్టి మోదీ పథకాలను గ్రామాల్లోని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆర్థిక పరిస్ధితి బాగోగులపై స్ట్రీట్ కార్నర్‌లు రెండో విడత నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అయోధ్యలోని రామమందిరాన్ని వీక్షించేందుకు రైళ్ల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీలు నియోజకవర్గాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు.