TSPSC పరీక్షలు రీ-షెడ్యూల్..

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ కనపరుస్తున్నారు. ఇప్పటీకే అనేక నిర్ణయాలు తీసుకోగా..తాజాగా TSPSC పరీక్షలు రీ-షెడ్యూల్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలలో పేపర్ లీక్, పరీక్షల వాయిదాలు విద్యార్థులను గందరగోళానికి గురి చేశాయి. ఈ అంశానికి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

TSPSC ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చెయ్యడం, దాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించడంతో దరిద్రం వదిలిపోయిందంటూ.. అశోక్ నగర్‌లో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం.. పరీక్షల నిర్వహణ, రీషెడ్యూల్‌పై లోతుగా చర్చించినట్లు తెలిసింది. జనవరిలో జరిగే గ్రూప్-2 పరీక్షతోపాటూ.. ఇప్పటివరకూ వచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలన్నీ రీషెడ్యూల్ చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా జాబ్ కేలండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్ చేస్తారని సమాచారం.