రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష..ఎందుకంటే..!

జీవిత రాజశేఖర్ దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్ట్. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌పై రాజశేఖర్‌ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ 2011లో ఈ కేసు దాఖలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అమ్ముకుంటున్నారని… అవకతకలకు పాల్పడుతున్నారని జీవిత, రాజశేఖర్ దంపతులు మీడియా ముందుకు పేర్కొన్నారు. దాతల నుంచి ఉచితంగా సేకరించి రక్తాన్ని అమ్ముకుంటున్నారని రాజశేఖర్ దంపతులు ఆరోపణలు చేశారు. అయితే.. వారి వ్యాఖ్యలపై అల్లు అరవింద్‌ 2011 లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సాయిసుధ సంచలన తీర్పు వెల్లడించారు.

సుదీర్ఘ విచారణ అనంతరం సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. రాజశేఖర్‌, జీవితకు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు 5 వేల జరిమానా విధించింది. అయితే, జరిమానా చెల్లించడంతో… ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరికి 10 చొప్పున పూచీకత్తులను సమర్పించగా కోర్టు పైకోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ బెయిలు మంజూరు చేసింది.

లోని 17వ అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు