కరోనా సోకిన తల్లి..త‌ల్ల‌డిల్లిన కొడుకు

ఆస్ప‌త్రి గోడెక్కి కిటికీ ద‌గ్గ‌ర కూర్చుండి..అమ్మను చూస్తున్న కొడుకు

Palestinian Man Climbs Wall to See Mother Through

పాలస్తీనా: కరోనాతో కొడుకు కళ్లముందే తల్లి నరకయాతన పడుతుంటే ఆ కొడుకు మనసు తల్లడిల్లిపోయింది. తల్లి బాగోగులు దగ్గరుండి చూసుకోలేక, అలాగని ఆమెను చూడకుండా ఉండలేక ఓ కొడుకు తల్లి చికిత్స పొందుతున్న పొందుతున్న ఆసుపత్రి గది కిటికీ ఎక్కి కూర్చుని రాత్రీపగలు తల్లిని చూసుకునేవాడు. అయితే, తల్లి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తుందన్న అతడి ఆశలు ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పాలస్తీనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చూసిన వారి హృదయాలను పిండేస్తోంది. ఆసుపత్రి గది కిటికీపైకి ఎక్కి తల్లిని చూసుకున్న ఆ కుమారుడి పేరు జిహాద్ అల్సువైటి. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి మహ్మద్ సఫా ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా పాల‌స్తీనాలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 8 వేల కేసులు న‌మోద‌వ‌గా 60 మంది మ‌ర‌ణించారు.

తాజా బిజినెస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/