ప్రభుత్వ ప్రయోజనాలు పొందేవారికి గ్రీన్‌కార్డు నో

Green Card (File Pic)
Green Card (File Pic)

తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకున్న గ్రీన్‌ కార్డు నిబంధన నిర్ణయాన్ని అమెరికా సుప్రీం కోర్టు సమర్ధించింది..ఇదిలా ఉండగా, ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులకు గ్రీన్‌కార్డును నిరాకరించే ఈ విధానం వల్ల భారతీయులు నష్టపోయే అవకాశం ఉంది.. మెడికో ఎయిడ్‌, పుడ్‌ స్టాంప్స్‌, హౌసింగ్‌ ఓచర్లు వంటి ప్రయోజనాలు పొందినవారికి అమెరికాలో శాశ్వత నివాస సౌకర్యం కల్పించే గ్రీన్‌కార్డును నిరాకరించాలని ప్రతిపాదిస్తూ ఈమేరకు ఒక నిర్ణయాన్ని రూపొందించారు.. ఈ నిబంధన అమలుకు ఆమోదం తెలుపుతూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.. ఇదిలా ఉంటే ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లో అయిదుగురు ఈ నిర్ణయానికి మద్దుతు ఇవ్వగా, నలుగురు వ్యతిరేకించారు.. కాగా ఈ కొత్త నిబంధనల అమలుపై స్టే విధిస్తూ న్యూయార్క్‌లోని రెండో సర్క్యూట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది.. ఇదిలా ఉండగా పలు రాష్ట్రాల్లో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలైన సంగతి విదితమే.
అంతేకాకుండా తాజా నిబంధన ప్రకారం. గ్రీన్‌కార్డు దరఖాస్తు చేసుకునే వలసదారులు తమ ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులో వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధృవీకరించాల్సి ఉంటుంది. అలాకాకుండా దరఖాస్తుదారులు భవిష్యత్తులో ఆ ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని అధికారుల భావిస్తే కనుక వారికి గ్రీన్‌కార్డు నిరాకరించే అవకాశం కూడ ఉందని తెలిసింది. గణాంకాలను బట్టి చూస్తే ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్‌కార్డుకోసం దరఖాస్తులు అందజేస్తుంటారు.. అయితే వలసదారుల్లో కొందరికి మాత్రమే వారి ఇమిగ్రేషన్‌ స్టేటస్‌ను అనుసరించి మెడిక్‌ ఎయిడ్‌, ఫుడ్‌స్టాంప్స్‌,హౌసింగ్‌ ఓచరుల వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/