నల్ల జాతి మహిళల ఆవేదన..

జీనవ పోరాటం

Women's consciousness .
Women’s consciousness .

నల్ల జాతీయులు ఇంకా వివక్షకు గురవుతున్నారు. దైనందిన జీవితంలో వీరు నిత్యపోరాటంతో సహజీవనాన్ని సాగిస్తున్నారు.

ఇక మహిళల పరిస్థితి గురించి చెప్పేందుకు వీలుండదు. ఎంతో నైపుణ్యం ఉన్నా కూడా వివక్షతో అభివృద్ధికి నోచుకోవడం లేదు.

కెరీర్‌లో తమ సత్తాను చాటుకుంటున్నా అందుకు పొందాల్సిన ఫలాలను మాత్రం పొందలేకపోతున్నారు.

నల్లజాతీయుల మహిళలు పొందుతున్న ఆవేదనను కళ్లకు కట్టినట్లుగా ద వానిషింగ్‌ హాఫ్‌ అనే నవల కనిపిస్తుంది. మాలర్డ్‌… అమెరికా దక్షిణాదిలో మాప్‌లో దొరకని ఒక కాల్పనిక గ్రామం ఇది.

అక్కడున్న నల్లవాళ్లంతా తెల్లవాళ్లుగా చలామణి కాగలిగినంత తెల్లగా, తగ్గితే కాస్త చామనఛాయగా ఉంటారు. వీళ్లు ఇటు పూర్తిగా నల్లవారూ కాదు, ఇటు తెల్లవాళ్లలో కలిసిపోనూలేరు.

స్టెల్లా, డెజిరీ అనే ఇద్దరు అమ్మాయిలూ ఒకే పోలికతో ఉన్న కవలలు. తండ్రి చదువు రానివాడైనప్పటికీ అతను ఒక అమెరికన్‌ యువతికి అసభ్యకరమైన ఉత్తరం రాసాడన్న నెపం మీద అమెరికన్లు కొంతమంది అతన్ని కొడుతూ బయటకు ఈడ్చుకెళ్లి తుపాకీతో కాల్చిచంపేస్తారు.

తలుపుచాటు నుండి ఈ దృశ్యాన్ని చూసిన కవలలకి అప్పటిదాకా తమ అస్తిత్వాల గురించి అర్థంకాని విషయమేదో ఆ క్షణంలో అర్థమయినట్టు అనిపిస్తుంది. ఒ

కరికొకరు అన్నట్టుగా ఉండే ఈ అక్కచెల్లెళ్లు, తండ్రి చనిపోయాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక అమెరికన్‌ ఇంట్లో పనిచేయటం మొదలుపెడతారు. ఉన్న ఊరిలో భవిష్యత్తు లేదనుకున్న కవలలు తల్లికి చెప్పకుండా ఊరొదిలి పారిపోతారు.

న్యూ ఆర్లీన్స్‌కి చేరుకున్న కొద్దిరోజుల తరువాత డెజిరీని వదిలేసి వెళ్లిపోతుంది స్టెల్లా.

‘వైట్‌ ప్రివిలేజెస్‌ కోసం స్టెల్లా అమెరికన్‌ యువతిగా చలామణి అవుతూ ఉన్నత కుటుంబీకుడైన ఒక అమెరికన్‌ని పెళ్లిచేసుకుని తాను కోరుకున్న స్వతంత్రతా, భద్రతా, సమాజంలో గౌరం సంపాదించుకున్నప్పటికీ ఆమె జీవితం కత్తిమీద సాములా సాగుతుంది.

భర్త ప్రేమను పూర్తిగా పొందినా, ఒంటరితనం ఆమెను వేధిస్తూ ఉంటుంది. ఇంకొకరిలా మారడమనే ప్రక్రియ అసంపూర్ణమనీ, తనది కాని ప్రపంచంలో తను ఎప్పుడూ ఒంటరిదాన్నే అని ఆమె ఊహించలేదు.

నిరంతరం చేసే నటనలో ఎప్పుడైనా తాను దొరికిపోతుందేమో, భర్త తనను వదిలేస్తాడేమో అన్న అనుమానం స్టెల్లాను వెంటాడుతుంది.

తన గతాన్ని తానే తృణీకరించుకుందామనుకున్నా నిజం ఆమెను వేధిస్తూనే ఉంటాయి. ఈ పోరాటంలోనే స్టెల్లా ఒక అమ్మాయిని కంటుంది.

కూతురు కెన్నడీకి ఆమె విషయమంతా తెలిసిపోవటంతో, అప్పటికే ఇద్దరి మధ్యా ఉన్న దూరం మరింత పెద్దదవుతుంది.

జీవితంలో ఏం చేయాలో, తనకేం కావాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటుంది కూతురు కెన్నెడీ. ఇటు ఒంటరిగా జీవిస్తున్న స్టెల్లా సోదరి డెజిరీ కొంతకాలానికి ఒక నల్ల జాతీయుడి ని పెళ్లి చేసుకుంటుంది గానీ, అతను పెడుతున్న బాధల్ని తట్టుకోలేక కూతురు జూడ్‌ని తీసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చేస్తుంది.

మాలర్డ్‌లో తనను ప్రేమించిన, తనకీ ఇష్టమైన వ్యక్తితో సహజీవనం ప్రారంభిస్తుంది. కూతురు జూడ్‌ మాత్రం తను ఎదుర్కొంటున్న వివక్షకి అతీతంగా అకుంఠిత ధ్యేయంతో మెడికల్‌ కాలేజ్‌లో చేరుతుంది.

ఆడపిల్లగా పుట్టిన ట్రాన్స్‌ సెక్సువల్‌రీస్‌ పట్ల ఆమె ప్రేమా, అతనికి అసరానివ్వడం ఆమె స్థిర జీవిత దృక్పథాన్ని తెలియ జేస్తాయి.

నలభైయేళ్ల కథతో బాటు ఆ కథని వివక్ష, ఎల్జీబిటికూ చరిత్రలతో అనుసంధానించే స్పష్టమైన కాలరేఖ నవలలో ఉంది.

వానిషింగ్‌ హాఫ్‌ అదృశ్యమైపోతున్న సగం అస్తిత్వం అనేది నవలలోని కీలకాంశం.

విడిపోయిన డెజిరీ, స్టెల్లాలు తమలోని చెరిసగాలనీ, గతాన్ని కోల్పోవడం వల్ల స్టెల్లా తనలోని సగాన్నీ, మానసిక దూరాల కారణంగా స్టెల్లా, కెన్నెడీలు తమలో చెరి సగాలనీ కోల్పోయారు

. నవలంతా పరుచుకునున్న ఊపిరి సలపని అస్తిత్వాన్వేషణల సమస్యలకి భిన్నంగా జూడ్‌, రీస్‌ల మధ్య ప్రవహించే ప్రేమ మాత్రం కొంత ఊరట కలిగిస్తున్నది.

అమెరికన్‌ రచయిత్రి బ్రిట్‌ బెన్నెట్‌ రాసిన ద వానిషింగ్‌ హాఫ్‌ గత నెల రివర్‌హెడ్‌ ద్వారా విడుదలై అగ్రస్థానంలో నిలిచింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/