పాకిస్థాన్‌లో మే 9 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

గత 24 గంటల్లో 642 కొత్త కేసులు..ఇప్పటి వరకు 237 మంది మృతి అంతేకాక

Pakistan Extends Coronavirus Lockdown
Pakistan Extends Coronavirus Lockdown

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో పాక్‌లో కొత్తగా 642 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 11,155కు పెరిగింది. ఈనేపథ్యలో పాక్‌ ప్రభుత్వం మే9 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రణాళిక, అభివృద్ధిశాఖ మంత్రి అసద్ ఉమర్ తెలిపారు.  కాగా ఈవైరస్‌ బారి నుంచి 2,537 మంది కోలుకోగా, 237 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో 79 శాతం స్థానికంగా ఒకరి నుంచి ఒకరికి సోకడం ద్వారా వచ్చినవేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేకాక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ప్రార్థనలు చేసుకునేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన అనుమతినించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/