వాళ్ళంతా దానం చేయటానికి సినిమాలు తీస్తున్నారా?

సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ స్పందన

RamGopal varma
RamGopal varma

ఆర్జీవీ డబ్బు సంపాదించడానికే ఇలాంటి సినిమాలను తీస్తున్నాడనే విమర్శలపై. తాజాగా సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

వర్మ ట్వీట్ చేస్తూ.. ”నేను డబ్బు సంపాదించడానికి ఈ సినిమాలన్నీ చేస్తున్నాననే వారిని అడుగుతున్నా..

మిగతా ఫిలిం మేకర్స్ అందరూ డబ్బు సంపాదించడానికి సినిమాలు చేయడం లేదా? వాళ్ళందరూ మానవత్వం కోసమో ఛారిటీ కోసమా లేక పేద ప్రజలకు దానం చేయడం కోసమో సినిమాలు తీస్తున్నారా?” అని ట్వీట్ చేసారు.

దీనికి నెటిజన్స్ వర్మని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా అంటేనే కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యాపారం..

ఏ ఫిలిం మేకర్ అయినా కూడా డబ్బులు సంపాదించడానికే సినిమాలు తీస్తారని కామెంట్స్ చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/