ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను వాయిదా వేయాలిః హైకోర్టు ఆదేశాలు

పోలీసులతో ఘర్షణకు దిగుతున్న ఇమ్రాన్ మద్దతుదారులు

Pakistan court orders police to halt efforts to arrest Imran Khan

ఇస్లామాబాద్ః పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో లాహోర్ హైకోర్టు వెనక్కి తగ్గింది. ఆయనను అరెస్ట్ చేసే విషయంలో కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇమ్రాన్ అరెస్ట్ ను వాయిదా వేయాలంటూ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ నివాసం వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసులతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, లాహోర్ హైకోర్టు ఈమేరకు ఆదేశాలను జారీ చేసింది. గత మంగళ, బుధ వారాల్లో ఇమ్రాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. అయితే ఇమ్రాన్ మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆయనను అరెస్ట్ చేయడం కుదరలేదు.