హైదరాబాద్ లో మరో దారుణం.. 4 ఏళ్ల చిన్నారి ఫై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

హైదరాబాద్ లో మరోదారుణం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి ఫై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసాడు. ఈ ఘటన పట్ల యావత్ సభ్యసమాజం తలదించుకుంటుంది. కోర్టులు , పోలీసులు , ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఇప్పటికే ఎన్ని ఘటనలు వెలుగులోకి రాగా..ఇప్పుడు మరోటి.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ వెంకటయ్య (40) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా శంషాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రైవేట్ లేబర్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే కార్మికులు అందరూ శంషాబాద్ లోని ఓ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరితో పాటు కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తులు కూడా నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి వెంకయ్య పీకల దాక తాగి తాను నివాసం ఉండే చోటుకు వచ్చాడు. వీరి గుడిసె పక్కల నివాసం ఉంటున్న ఓ 4 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు. ఎలాగైన ఆ చిన్నారిని అత్యాచారం చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ బాలికపై వెంకయ్య అత్యాచారం చేశాడు. ఆ బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆ చిన్నారి తల్లి పరుగు పరుగున వచ్చి ఆ రాక్షసుడి చెర నుంచి తన బిడ్డను కాపాడుకుంది. వెంటనే జరిగిన దారుణంపై ఆ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ దారుణానికి పాల్పడిన వెంకయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.