పలు రాష్ట్రల సిఎంలతో భేటి కానున్న సోనియా గాంధీ

సమావేశంలో పాల్గొననున్న మమతా బెనర్జీ

Sonia-Gandhi-
Sonia-Gandhi-

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు బిజెపియేతర సిఎంలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జీఎస్టీ వసూళ్లు, కోవిడ్ కారణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ అంశాలపై వీరు సుదీర్ఘంగా చర్చించనున్నారు.

కాగా ఈ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్రంపై పలు రాష్ట్రాల సిఎంలు పట్టుబట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం నేడు వర్చ్యువల్ విధానంలో జరుగనుండగా, కరోనా కారణంగా ఆదాయాన్ని నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి పరిహారం అందించే విషయంలో ఒత్తిడి తేవాలన్న అంశం కూడా ఎజెండాలో ఉన్నట్టు తెలుస్తోంది. జీఎస్టీ బకాయిలను తక్షణం చెల్లించాలని కూడా సిఎంలు కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చని సమాచారం. ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో పాటు కేరళ సిఎం పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాబోవడం లేదని తెలుస్తోంది. నలుగురు కాంగ్రెస్ రాష్ట్రాల సిఎంలు హాజరవుతారని సమాచారం.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/