ఈ నెల 28నుంచి ఏపి బడ్జెట్ సమావేశాలు

AP Assembly
AP Assembly

అమరావతి: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 28నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 30న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2019 2020 బడ్జెట్ గడువు మార్చి 31తో ముగుస్తుంది. అయితే, ప్రస్తుత సమయంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి దానిపై శాసనసభ, శాసనమండలిలో చర్చించడానికి సుమారు 15 రోజుల గడువు అవసరం అవుతుంది. అయితే, మార్చి 31వ తేదీలోపు బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఏప్రిల్ నెలలో ప్రభుత్వం జీతాలు, ఇతర ఖర్చుల నిమిత్తం ఖజానా నుంచి తీసుకోవడానికి నిబంధనలు ఒప్పుకోవు. దీంతో తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి… నాలుగైదు రోజుల్లో దాన్ని ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/