పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన వైఎస్‌ఆర్‌సిపి నాయకులు

Gajuwaka ysrcp leaders join into janasena
Gajuwaka ysrcp leaders join into janasena

విశాఖ: ఏపిలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఆరంభమైంది. పార్టీల నాయకులు నువ్వా? నేనా? అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖకు అతి సమీపంలోని గాజువాకలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. అదేంటంటే గాజువాకకు చెందిన పలువురు వైఎస్‌ఆర్‌సిపి నేతలు జనసేన పార్టీలో చేరారు. అధికారం ఉన్న పార్టీని వదిలి మరీ జనసేన చేరిన నాయకులు స్పందిస్తూ..జనసేన భావజాలం నచ్చడం వల్లే జనసేనలో చేరామని, ఇకపై పవన్‌ నాయకత్వంలో తామంతా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అయితే గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసి, రెండు చోట్లా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి పార్టీ జనసేన నాయకుల్ని తమ పార్టీలోకి తెచ్చుకుని పవన్‌కు షాకిచ్చింది. అయితే ఇప్పుడు స్థానిక పోరు నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు జనసేనలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/