ఆరెంజ్ పీల్ టీ తయారీ ఇలా.

న్యూ వెరైటీ రుచులు

కావాల్సినవి:

కమల పండు తొక్కలు -2, నీళ్లు -కప్పున్నర , దాల్చిన చెక్క- చిన్న ముక్క, లవంగాలు-3, ఆకుపచ్చ ఇలాచీలు -2, బెల్లం – చెంచా,

తయారు చేసే విధానం:

గిన్నెలో నీళ్లు పోసి మంటను మధ్యస్తంగా పెట్టి వేడి చేయాలి.. దీంట్లో బెల్లం తప్ప కమలాపండు తొక్కలతో పాటు ఇతర దినుసులన్నీ వేయాలి.. రెండు, మూడు నిముషాలు బాగా మరిగించాలి.. పొయ్యి కట్టేసి, టీ ని కప్పులోకి వడగట్టుకోవాలి… ఇందులో బెల్లం కలిపితే వేడివేడి ఆరెంజ్ పీల్ టీ రెడీ… దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధకత పెరుగుతుంది.. తయారీ వేరే విధంగా ఉండాలంతే ఆపిల్ తొక్కతోనూ టీ చేసుకోవచ్చు…

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/category/news/national/