అభిప్రాయం చెప్పడమే నేరమా?

People

భారత రాజ్యాంగం ప్రకా రం ప్రతి పౌరుడికి వివిధ అంశాలపై తన అభిప్రా యం చెప్పేందుకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది.ఈ స్వేచ్ఛని మనం ప్రాథమిక హక్కులలో భాగంగా చూడాలి. కానీ ఇటీవల కొన్ని పరిణామాలని చూస్తే పాలకుల నిర్ణయాలకు అనుకూలంగా అభిప్రాయాలు తెలియచేసే వారిని దేశభక్తులుగా, వ్యతిరేకంగా వ్యక్తం చేసే దేశద్రోహులుగా ముద్రవేసే ప్రయత్నాలు జరుగు తున్నాయి.

ఉదాహరణకు పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగుమాధ్యమం కూడా ఉండాలని కోరే వారిపై నిమ్నవర్గాలవారికి వ్యతిరేకంగా ముద్రవేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంగ్లీషు మాధ్యమాన్ని కోరేవారిపై మాతృభాషా ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇటువంటి ముద్రవల్ల అసలు విషయం పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. ఎవరైనా సంక్రాంతికి కోడిపందెలు వేయవద్దనో లేదా దీపావళి కాలుష్య రహితంగా జరుపుకోమనో లేదా వినాయక చవితినాడు మట్టి విగ్రహాలు వినియోగించాలని ప్రచారం చేస్తే అటువంటి వారిపై హిందూ మత వ్యతిరేకులుగా ముద్రవేసి సామాజిక మాధ్యమాల లో వారిపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు.

కాలుష్యం లేని పండుగలు జరుపుకోమని ప్రచారం చేయబోతే తమ మనో భావాలు దెబ్బతింటున్నాయని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నా యి. ప్రభుత్వాలు అన్నిసందర్భాలలో సక్రమమైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో చర్చలు శాంతియుతంగా, నిర్మాణాత్మకంగా జరిగేవి. రానురాను నిర్మాణా త్మకమైన చర్చల స్థానంలో వ్యక్తిగత దూషణలు చట్టసభల్లో చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు చెప్పేవారిపై దాడులు పెరుగుతున్నాయి.

చట్ట సభల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పెరుగుతుందే తప్ప వాటి అమలులో అంత చొరవ కన్పించడం లేదు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రసాదించింది. పౌరులు వాళ్లు ఆలో చించే దానిమీద, వాళ్లు అనుసరించే మతం లేక మతాన్నే అనుసరించకపోవడం, తమ భావాలని వ్యక్తపరిచే విధానం లేదా భావాలనిచర్చలలో చేపట్టడం,అందరూ కలిసి సంఘాలు,పార్టీలు గా ఏర్పడటంవంటి స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. దేనిపైనా బల మైన కారణాలులేకుండా నియంత్రణ ఉండరాదు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి అంబేద్కర్‌ వంటి మహ నీయులు పౌరులకి స్వేచ్ఛనిచ్చారు.

Opinion
Opinion

రాజ్యాంగం అవకాశాలలో సమానత్వా నికి హామీనిస్తుంది. హక్కులు కోల్పోయిన బహుజనులు, మైనా ర్టీలుభిన్నాభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుంది.వీరిపై రెండు రకాల దాడులు జరుగుతున్నాయి. తమ హక్కుల కోసం వీరు ఉద్యమించినప్పుడు ప్రభుత్వాలే నియంత్రించడం మొదటి రకం కాగా, ప్రభుత్వాలనిర్ణయాలను సమర్థించే మరోవర్గం అణగారిన వర్గాలవారిపై దాడిచేయడం రెండవరకంగా చెప్పవచ్చు.

అభిప్రా యం చెప్పే విషయంలోనే ప్రశ్నించే గుణం ఇమిడి ఉంటుంది. ప్రశ్నించడం ద్వారానే జవాబుదారీతనంవస్తుంది. భిన్నాభిప్రాయా లకు అవకాశం ఉన్నప్పుడే పాలనలో పారదర్శకత పెరిగి విశాల ప్రజాప్రయోజనాలని కాంక్షించే నిర్ణయాలు వెలువడతాయి.

  • యం.రాంప్రదీప్‌

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/