తెలంగాణ కార్మికులు, ఉద్యోగులకు నేడు సెలవు

Government of Telangana
Government of Telangana

హైదరాబాద్‌: తెలంగాణ ఫ్యాక్టరీస్‌, ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతున్న 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో ఈ సెలవు వర్తిస్తుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 58 డివిజన్‌లకు 24న పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడ పోలింగ్‌ రోజు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కార్మిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/