ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

ఎండలు బాబోయ్: – పి.రూతు, హైదరాబాద్‌

గత వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. మరో వారం రోజులపాటు ఈ తీవ్ర ఎండలు ఉంటాయి. ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు.

ఒకవైపు లాక్‌డౌన్‌తో కూలీలకు, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి లేక కాస్త సడలిం చగానే పనులు చేసుకుని, కాస్త డబ్బు సంపాదించుకుందామని ప్రయత్నిస్తుంటే ఈ ఎండల తీవ్రతతో అది సాధ్యం కావడం లేదు.

అయినా తప్పదు రెక్కాడితేకాని డొక్కాడని వలస కూలీ లు, పేదలు మండే ఎండల్లోసైతం పనులు చేసుకోవా ల్సిందే. ఒకవైపు కరోనా విజృంభన, మరొకవైపు ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ‘

వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసు కోకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కాబట్టి ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

విశాఖ రాజధానిగా ఉండాలి: -ఎం.వి.ప్రసన్నకుమార్‌, కాకినాడ.

మనరాష్ట్రానికి తూర్పునున్న నెల్లూరు నుండి విశాఖాపట్నం వరకూ కోస్తాతీరమంతా, రాయలు పాలించిన రాయలసీమ అంతా కలుపుకుని సువిశాల రాష్ట్రం మనది. రాజధాని అమ రావతి, అమరావతి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.

దానిపేరు రాష్ట్రా నికి పెట్టడం అందరికీ ఆమోదయెగ్యమే. రాష్ట్ర నామకరణం జరగడకుండానే మాజీ సిఎం చంద్రబాబు నాయుడు తన అను నాయులు కలిపి అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుందని ముందుగానే అక్కడి రైతులను ముప్పుతిప్పలు పెట్టి పొలాలకు అగ్గిపెట్టి కాల్చి పోలీసులతో రైతులను లొంగదీసుకొని వందల ఎకరాలు భూములు కారు చౌకగా కాజేసిన ముఠా అది.

వర్షా కాలంలో కృష్ణానదికి వరదలొచ్చి చంద్రబాబు ఉన్న ఇంట్లోకి సహా మొత్తం వరదనీటితో మునిగిపోయింది.

అక్కడ రాజ ధాని నిర్మించేందుకు ఎవరు ఒప్పుకుంటారు. విశాఖరాజధాని అయితే వెనుకబడిని విజయనగరం, శ్రీకాకుళం అభివృద్ధి చెందుతాయి.

తెలుగు మాట్లాడడం మన సంస్కారం:-కె. నాగేంద్ర, హైదరాబాద్‌

తెలుగుభాషకు సంబంధించిన అలవాట్లు, అభి రుచులు, సంస్కృతీ సంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవ్ఞ తున్నా యి.

కొందరయితే తెలుగు మాట్లాడితేనే తమ అంతస్తుకి, గొప్పతనానికి భంగమనుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు తమ పద్ధతిని మార్చుకుని తెలుగుభాషను గౌరవించడం నేర్చుకో వాలి. అప్పుడే తెలుగుభాషలోని మాధుర్యం, నుడికారపు సొంపు తొణికిసలాడుతుంది.

మనదితెలుగుభాషా, మనం తెలుగువాళ్లం, మనది తెలుగుజాతి. మన భాష చెక్కుచెదర కుండా సుభిక్షంగా వ్ఞండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మనదే.

మానవతా మూర్తులకు వందనాలు:- లక్ష్మీ, నెల్లూరు

ఒక లక్ష్యంతో, తదేక దీక్షతో కనిపించని శత్రువుతో పోరాడు తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికు లు చేస్తున్న సేవలు మాటలతో చెప్పలేనివి. కరోనా బాధితు లను కంటికి రెప్పలా కాపాడుతున్న వీరు నిజమైన మానవతా మూర్తులు.

ఈ మహా సంగ్రామంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రతిచోటికి వెళ్లి ఎప్పటికప్పుడు తాజా వార్తలను మన కందిస్తున్న పాత్రికేయులు, మీడియా సిబ్బందికి, ప్రభుత్వ అధికారులకు వందనాలు.

కరోనాపై యుద్ధం చేస్తూ శారీరకం గా, మాన సికంగా అలసిపోతున్న డాక్టర్ల మేధాశక్తి, నర్సుల సేవాశక్తి అ ద్భుతం. కొన్ని చోట్ల ప్రాణాలు పోస్తున్న డాక్టర్లపై దాడి చేయ డం మానవత్వానికి మచ్చ.

ఆరోగ్యాన్ని , దేశాన్ని కాపాడుకుందాం:- కె.శ్రీనివాస్‌, విజయవాడ

లక్షలాది మంది ప్రజలు తిరుగాడే ప్రాంతాలన్నీ గత నెల రోజు లుగా బోసిపోమాయి. అయినా ఎవరికీ ఏ ఆటంకం కలగడం లేదు. రోజులు యధాతధంగా రిగి పోతున్నాయి.

ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కుటుంబమంతా ఇంట్లో చేసుకున్న వం టలతో అంతా కలిపి మెలసి తినడం తిరగడం వలన పిల్లా పెద్దలలో ఐకమత్యం నింపింది. ఇలా ‘కరోనా ఓరకంగా మం చే చేసిందేమో!

ఇప్పటికైనా జరిగిన అనర్ధాలు, ఉరుకులు పరు గులు యాంత్రికంగా మారిన జీవన విదానాన్ని గమనంలోకి తీసుకుని ఒత్తిడి ఆందోళనలకు తావు లేకుండా లాక్‌డౌన్‌ తొల గించినా సదా ఆచరించి జీవితాంతం సంతోషంగా ఆరోగ్యాన్ని దేశాన్ని కాపాడుకుందాం.

సోషల్‌ మీడియాకు బానిసలు: -ఎం.దుర్గ,గుంటూరు

పాశ్చాత్య నాగరికతా ప్రభావం చేత అధిక యువత నేడు సోష ల్‌ మీడియాకు బానిసలుగా మారడం దురదృష్టకరం. ఫేస్‌ బుక్‌, చాటింగ్‌ వాట్సాప్‌ వంటి సాధనాల ద్వారా పరిచయం లేని వ్యక్తులతో స్నేహం చేసి అనేక ఇబ్బందులు కొని తెచ్చు కుంటున్నారు.

ఇంటర్నెట్‌లో స్నేహం ప్రభావం వలన ఆర్థికం గా ఇబ్బందుల పాలుకావడంతోపాటు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో కూడా పడిపోతున్నారు. అతిగా సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌, కంప్యూ టర్‌ వాడకం వలన నిద్రలేమితోపాటు పలు మానసిక సమస్య లను కొని తెచ్చుకుంటున్నారు.

సోషల్‌ మీడియాలో పేరు ప్రతిష్టల కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రసారం అయ్యే అసత్యాలు, గాలివార్తలు, మూఢ నమ్మకాల వలన యువత పెడత్రోవపడుతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/