ప్రజావాక్కు

సామాజిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

వైద్యులకు రక్షణ కల్పించాలి:- యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

గత ఆరు నెలలుగా కొవిడ్‌ బారినపడుతున్న లక్షలాది రోగు లకు వైద్యం అందించి సుశిక్షితులుగా, మృత్యంజయులుగా మార్చింది వైద్యసిబ్బంది మాత్రమే.

తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యసేవలే పరమార్థంగా ఎంచివృత్తిలో కొనసాగు తున్నారు.

వైద్యసేవలందిస్తూఎంతోమంది వైద్యులు మరణిం చిన సంగతి మరువరాదు.

అయితే రాష్ట్రంలో వైద్యులపై దాడులు జరగడం, మానసిక క్షోభకు గురి చేసి బాదించి, బం ధించే విధంగా ప్రవర్తించడంతో వైద్యులు ఆత్మస్థైర్యం కోల్పో యే ప్రమాదముంది.

ఇప్పటికే అత్యధిక రోగులతో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉంది. పాలకులు స్పందించి కరోనా ను రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు వైద్యులకు మానసిక ఆందోళనకు గురికాకుండా తగిన రక్షణ కల్పించాలి.

ఆరోగ్యమూ-డిజిటల్‌ భాగ్యమూ:-డా.డి.వి.జి శంకరరావు, పార్వతీపురం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని జాతీయ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

రానున్న రెండు మూడేళ్లలో అందరికీ, వారివారి ఆరోగ్య వివరాల్ని నిక్షిప్తం చేయబడిన డిజిటల్‌ హెల్త్‌ కార్డులందించడం ప్రణాళిక. తద్వా రా వ్యక్తి ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉండి, వైద్యసేవలు శీఘ్రంగా అందించే అవకాశం ఉంటుందని భావన.

మంచి ఆలోచనే.కానీ చాలాకష్టంతో కూడుకున్న వ్యవహారం. వైద్య సేవలు అందరికీ అందుబాటులో, ఉచితంగా కాకున్నా చవకగా అందించడం ముఖ్యం. అందరికీ విద్య ఎలాగో, అందరికీ ఆరో గ్యం అన్నది ప్రాథమిక అవసరం.

మనదేశంలో వైద్యసేవలు అటు అందరికీ అందుబాటులో లేవ్ఞ. ఇటు చవకగా లభ్యం కావ్ఞ. ఈ కారణంగా ఏ దేశంలోనూ లేని రీతిగా మనదేశంలో ఆరోగ్యానికి వ్యక్తి పెట్టాల్సిన ఖర్చు ఎక్కువ.

ఒక్క ఆరోగ్యానికి వెచ్చింపులతోనే చాలా మంది ఆర్థికంగా దిగజారే పరిస్థితి.

జలమయమైన రోడ్లు: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు భారీగా పడటం వల్ల జనజీవనం అంతా అస్తవ్యస్తం అయింది.

ఈ వర్షాల కారణంగా గ్రామాలలోని వీధులు, మున్సిపాలిటీలలోని కాలనీలు అన్ని బురదమయంగా మారిపోయినాయి.

వీటిని శుభ్రం చేసే పనిలో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక నిధులను విడుదల చేయాలి. కొన్నిచోట్ల వాగులు పొంగిపొర్లడం వల్ల రాకపోకలు తెగిపోయినాయి.

ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అతివేగం అనర్థదాయకం:-సింగంపల్లి శేషసాయికుమార్‌, రాజంపేట

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నది కేవలం అతివేగం వల్లనే. ఇటీవలి కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల విషయం లో యువత వేగానికి కళ్లెం వేయకపోవడం వల్లనే ప్రమాదాలు సంభవించాయి.

పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా పిల్లల చేతికి ద్విచక్ర వాహనాలు ఇవ్వడం కూడా ఇందుకు ఒక కార ణం.

హెల్మెట్‌ ధరించకపోవడం, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వంటివి చేస్తూ వీరు వాహనాన్ని నడపడం వల్ల వారి ప్రాణాలకు ప్రమాదంతోపాటూ, ఎదుటివారి జీవితా లను సైతం ఆపాయానికి గురిచేస్తున్నారు.

దీనిని అరికట్టడం కేవలం పోలీసులకు మాత్రమే సాధ్యంకాదు. ఇంట్లో తల్లిదండ్రు ల దగ్గర నుంచి ఈ పని మొదలైనప్పుడు మాత్రమే మనం రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు.

అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

రాష్ట్రంలో కరోనా కారణంగా పనులు లేక లక్షలాది నిరుపేద కుటుంబాలు రోడ్డునపడ్డాయి. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ అభాగ్యజీవ్ఞలు కాలే కడుపులతో పస్తులుంటున్నారు.

ఈ నేపథ్యంలో పేదవారికి తక్కువ ధరలకే టిఫిన్‌, కాఫీ, భోజనం అందించే అన్న క్యాంటీన్‌లను వెంటనే తెరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

అవినీతి ఆరోపణలపై గత జులైలో ఈ క్యాంటీన్లుమూతపడగా ఇప్పటివరకు ఈ అవినీతి ఆరోపణలపై ఎలాంటి పురోగతి లేకపోవడం బాధాకరం.

రాజకీయ కారణాల తో ఒక మంచి పథకాన్ని మరొక ప్రభుత్వం కుంటి సాకులతో మూసివేయడం విజ్ఞత అనిపించుకోదు.

పేదలపాలిట సంజీవని అయిన అన్న క్యాంటీన్లను ప్రతి గ్రామంలో వెంటనే ప్రారం భించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

అర్హులనే నియమించాలి:- చందన రవీంద్ర, విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గ్రామసచివాలయ వ్యవస్థలో భాగంగా పశుసంవర్ధకశాఖ సహాయకులు 6,858 పోస్టులకి గాను మొత్తం 1931 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ కోర్సుల కు అర్హత కల్పించే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలి.

నోటిఫికేషన్లు సూచించిన విద్యాహర్హతలు మేరకు మాత్రమే భర్తీ చేయాలి. వేరే విద్య అర్హత కలిగిన వారిని నియమించకూడదు.

ప్రస్తుతం వెటర్నరీ డిప్లమో, పౌల్ట్రీ డిప్లమో, ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులను మాత్రమే రాబోయే నోటిఫికేషన్‌కు అర్హులను చేయాలి. ఇలా అయితే ఈ పోస్టులకు న్యాయం జరుగుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/