418 కేజీల వెండితో జగన్ నమూనా చేయించిన ముక్కాల ద్వారకా నాధ్..

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు నెల్లూరు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకా నాధ్. 418 కేజీల వెండితో సీఎం జగన్మోహన్ రెడ్డి నమూనాను చేయించి అందర్నీ ఆకట్టుకున్నారు. కోయంబత్తూరు నుంచి ప్రత్యేక నిపుణులను పిలిపించి ఈ నమూనా చేయించారు.

నెల్లూరులోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ ఈ నమూనా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకా నాథ్.. అందరికంటే భిన్నంగా ఉండేలా వెండి పట్టీలతో సీఎం ప్రతిబింబాన్ని రూపొందించామని తెలిపారు. తమకు దైవ సమానమైన సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా ఇది చేశామన్నారు.

ద్వారకా నాథ్ గతంలో నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌ గా పనిచేశారు. అయితే, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ద్వారకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏం చేయాలో తనకు తెలుసునని, అది తన బాధ్యత అని పార్టీ శ్రేణుల ముందు బహిరంగ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇప్పుడు నుడా చైర్మన్‌గా ద్వారకా నాథ్‌ను సీఎం జగన్ ఎంపిక చేశారు.