రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఇద్దరికి గాయాలు

Road Accident
Road Accident

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం జాతీయరహదారిపై ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మదనపల్లి నుంచి కాకినాడకు టమాటా లోడుతో వెడుతున్న వ్యాన్  ఎదురుగా వస్తున్నమోటారు బైకుని ఢీకొని బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో కండెల్లి సతీష్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, క్షతగాత్రులను వంగలపూడి సురేంద్ర, కొండేటి చంటిగా గుర్తించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/