అమరావతిలో 144 సెక్షన్..హైకోర్టు ఆగ్రహం
పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను పరిశీలించిన న్యాయమూర్తి

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగు వారాలుగా నిత్యం అక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. రాజధాని తరలింపుపై రైతులు భగ్గుమంటున్నారు. రాజధాని కోసం తాము చేసిన భూ త్యాగం వృథా పోవాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అమరావతిలో పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 చట్టం విధించారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు, రాజధానిలో పోలీసు చట్టాల అమలుపై అసంతృప్తి వెలిబుచ్చింది. రాజధానిలో పరిస్థితులకు సంబంధించి పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. పూర్తి వివరాలతో శుక్రవారం ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/