ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించిన జగన్

తిరుపతి పర్యటన లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..గురువారం ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి మఠాధిపతి సుబుదేంద్ర తీర్థస్వామి ఆశీస్సులతో.. చానళ్లు ప్రారంభించారు. శ్రీవారి ఆలయం ఎడమవైపున అధునాతన సాంకేతికతో నిర్మించిన బూందీ తయారీ పోటును ప్రారంభించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో తితిదే చేపట్టిన నూతన కార్యక్రమాల గురించి….అధికారులు వివరించారు.

బుధువారం తిరునామం, పంచెకట్టుతో, తలకు పట్టువస్త్రంతో కట్టిన పరివట్టంతో, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు జగన్. ఈ సందర్భంగా వేదపండితులు సీఎం వైయస్‌ జగన్‌కు ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సీఎం వైయస్‌ జగన్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. 2022 తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్‌ను, డైరీని సీఎం వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అంత‌కుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.