శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలకలం..

శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలకలం..

ఒమిక్రాన్‌ ఈ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వినిపిస్తుంది. కరోనా ముప్పు నుండి ఇంకా ప్రజలు బయటపడకముందే..ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లో ఈ కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్ బయటకువచ్చింది. ఇప్పటికే పలు దేశాలతో పాటు మనదేశంలోనూ ఈ కేసులువేలుగులోకి వచ్చాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాలనుండి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు.

ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. రీసెంట్ గా దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం తో అధికారులంతా టెన్షన్ పడుతున్నారు. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జిల్లాకు వచ్చాడు. ఈ విషయం తెలిసి అధికారులు ఉమిలాడ గ్రామానికి చేరుకొని అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. తిరిగి 14 రోజుల అనంతరం మళ్లీ కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా, మళ్లీ కరోనా పాజిటివ్ రావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. అతన్ని హుటాహుటీన శ్రీకాకుళం రిమ్స్కు తరలించిన అధికారులు.. ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.