రజనీకాంత్ ను కలిసిన చిన్నమ్మ ..కారణం అదేనా..?

తమిళనాట ఇప్పుడు శశికళ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఈమె సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవడం తో అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దివంగత జయలలిత హయాంలో ఎడిఎంకె తరఫున అన్నీ తానై వ్యవహరించిన చిన్నమ్మ శశికళ జయ మరణానంతర పరిణామాలతో పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ పార్టీ కైవసం కోసం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నది. ఈ క్రమంలో శశికళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశారు.

చెన్నైలోని పొయెస్ గార్డెన్ లో ఉన్న రజనీ నివాసానికి వచ్చిన శశికళ ఆయనతో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రజనీ, ఆయన అర్ధాంగి లతతో ఆమె ముచ్చటించారు. కాసేపటికి రజనీకాంత్‎ను ఎందుకు కలిశారో ప్రకటన విడుదల చేశారు. “రజినీ ఇటీవల అనారోగ్యంతో బాధపడ్డారు. పరామర్శ కోసం మాత్రమే ఇంటికి వెళ్లాను. ఎలాంటి రాజకీయ కోణం లేదు” అని ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఉద్దేశం అది కాదని.. అసలు వ్యూహం వేరే ఉందని వార్తలు వస్తున్నాయి.