ఇకపై యూఏఈలో నాలుగున్నర రోజులే పనిదినాలు!

ఇకపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకే విధులు
శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు సెలవు

న్యూఢిల్లీ: ఉద్యోగుల పనిదినాల విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు నాలుగున్నర రోజులే పనిదినాలు ఉంటాయని ప్రకటించింది. ఇప్పటిదాకా యూఏఈలో ఐదు రోజుల పనిదినాలు ఉండేవి. దాని ప్రకారం శని, ఆదివారాలు సెలవు.

అయితే, ఇక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకే విధులు ఉంటాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వారాంతపు సెలవులు షురూ అవుతాయి. ఇకపై అక్కడి ఉద్యోగులకు వారానికి రెండున్నర రోజులు సెలవులుగా లభిస్తాయి. ఈ నూతన విధానం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని యూఏఈ పాలకవర్గం పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/