అగ్రరాజ్యంలో లక్ష దాటిన కరోనా కేసులు

నిన్న ఒక్కరోజే 16వేల కొత్త కేసులు

corona virus
corona virus

అమెరికా: కరోనా.. ప్రపంచాన్ని అతలాకతలం చేస్తున్న ఈ వైరస్‌ ఇపుడు అగ్రరాజ్యం అమెరికాను ఊపిరి సలపకుండా చేస్తుంది. నిన్న ఒక్కరోజే అమెరికాలో కొత్తగా 16,877 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడి నిన్న ఒక్కరోజే అమెరికాలో 402 మంది చనిపోయారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1588 కి చేరింది. అమెరికాలో ని న్యూ ఓర్లీన్స్‌లోని మూడు కరోనా పరీక్షా కేంద్రాల వద్ద కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకోవడానికి అనుమానితులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/