ఏప్రిల్ 01 న సర్కారు వారి పాట

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్ర యూనిట్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మొన్నటి వరకు సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ట్రై చేసిన సడెన్ గా ఆర్ఆర్ఆర్ ఎంట్రీ తో సర్కారు వారు రిలీజ్ డేట్ మార్చుకోలేకతప్పలేదు. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామనే విషయాన్ని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. పరుశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ వారు నిర్మిస్తుండగా.. మహేశ్ బాబు కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. బ్యాంక్ కి సంబంధించిన భారీ స్కామ్ చుట్టూ ఆసక్తికరంగా నడిచే కథ ఇది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ అంత పూర్తి అవుతుంది. మహేష్ నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు.