పెదవులకు న్యూడ్‌ కలర్‌

Nude Colour for lips
Nude Colour for lips

న్యూడ్‌ లిప్‌ కలర్‌ అనేది లిప్‌స్టిక్‌ షేడ్స్‌లో ప్రత్యేకమైనది. స్మోకీ ఐస్‌ లేదా డ్యూ మేకప్‌తో సహా ఏ లుక్‌ మీదకైనా న్యూడ్‌ లిప్‌స్టిక్‌ చాలా బాగా మ్యాచ్‌ అవుతుంది. న్యూడ్‌ లిప్‌ కలర్‌ వాడే ముందు పెదవులను శుభ్రంగా కడుక్కోవాలి. దాంతో వాటి మీద ఉండే మృతకణాలు తొలగి పోయి మృదువుగా అవుతాయి. తరువాత లిప్‌ ఆయిల్‌ లేదా లిప్‌బామ్‌ రాసుకోవాలి. చర్మం రంగుకు సరిపోయే లిప్‌కలర్‌ ఎంచుకోవాలి. అంతేకాదు ఆ కలర్‌ పెదవుల రంగుకు సరిపోతుందా లేదా చూసుకోవాలి. అలా చెక్‌ చేసుకున్న తర్వాత ముదురు రంగు లిప్‌స్టిక్‌ రాసుకుంటే పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. న్యూడ్‌ లిప్‌ కలర్‌ ఒక్కటే వాడితే పెదవులు పాలిపోయినట్లుగా ఉంటాయి. అప్పుడు నేచురల్‌ కలర్‌ బ్రష్‌ వాడితే పెదవులు తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/