కుంకుమ పువ్వు.. చాలా ఉపయోగాలు

సౌందర్య పోషణ-ఆరోగ్య సంరక్షణ

Saffron flower .. Many uses
Saffron flower .. Many uses

‘గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతారు అని
అంటుంటారు. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా…రంగు, రుచి వాసనా ఉన్న అరుదైన సుగంధ ద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ ‘ప్రియమైన ఎర్రబంగారం!

కుంకుమపువ్వు.. ఈ పేరు వినగానే కాశ్మీర్‌ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా.

అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్‌ ఇరాక్‌, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకి కాశ్మీర్‌ కేసర్‌ నాణ్యమైనది. కుంకుమపువ్ఞ్వనే ఇంగ్లీష్‌లో ‘శాఫ్రాన్‌ అంటారు. ‘జాఫ్రాన్‌ అనే అరబిక్‌ పదం నుంచి ఇది ఆవిర్భవించింది. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాలంతటా దీనిని ‘కేసర్‌ అంటారు.

పువ్వంటే పువ్వు కాదు

కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్రలిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు వస్తాయి. కాశ్మీర్‌లో పండించే కుంకుమపువ్ఞ్వ మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు.

Saffron flower

కేవలం వంగపండు రంగు పువ్వుమాత్రం కనిపిస్తుంది. కాశ్మీర్‌లోని పాంపోర్‌ ప్రాంతంలోని నేలంతా అక్టోబరు-నవంబరులో విరబూసిన కుంకుమపువ్వుతో నిండిపోతుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది.

అదే కుంకుమపువ్వు అనుకుంటే పొరపాటే. అందులో ముచ్చటగా మూడే అండకోశాలు, రెండు కేసాలు, రెండు కేసరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు.

ఈ ఎరుపు రంగు భాగమే ఘాటైన వాసననీ, రుచినీ, రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశ భాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చు కున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడి పోతాయి.

అండకోశాలు రంగునీ, రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నిటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు. కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. అన్నింటినుంచీ అండకోశాలను చేత్తోనే వేరుచేయాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. శాఫ్రాన్‌ అంత ధర పలకడానికి ఇదీ ఓ కారణమే. మన దగ్గర గ్రాము కుంకుమపువ్ఞ్వ ధర సుమారు రూ.60 నుంచి 600వరకూ ఉంటుంది.

నాణ్యతను బట్టి ధర మారుతుంది. మనిషి వాడిన మొదటి సుగంధ ద్రవ్యం ఇదేనట. సుగంధ ద్రవ్యాల్లోకెల్లా ఖరీదైనది కూడా ఇదే. ప్రాచీన రోమన్లు స్నానానికి, జుట్టుకి రంగు వేసుకునేందుకూ కూడా దీన్ని ఎక్కువగా వాడేవారు. దీన్ని అంతటా వంటల్లోనే ఎక్కువగా వాడుతున్నారు.

Saffron flower-

బిర్యానీ, పాయసం, హల్వా, కాశ్మీరీ పలావ్‌…ఇలాంటివి ఏది చేయాలన్నా చిటికెడు కుంకుమపువ్ఞ్వ వేస్తే ఆ రుచే వేరు. పర్షియన్‌, స్పెయిన్‌ వంటల్లో ఇది తప్పనిసరి.

స్తోమత ఉండి వేయాలేగానీ, ఏ వంటలో వేసినా దానికి ఒకలాంటి ఘాటుతో కూడిన మంచి వాసన, రంగూ, రుచీ వస్తాయి. ఈ వాసన కారణంగానే దీన్ని పరిమళ ద్రవ్యాల్లోనూ వాడుతుంటారు. అయితే ఆహార పదార్థాల్లో వాడేటప్పుడు తగు మోతాదులోనే వాడాలి. మరీ ఎక్కువ వాడితే మొదటికే మోసం. రుచి మారి చేదెక్కుతుంది.

మేను సింగారంల కుంకుమపువ్వు మంచి సౌందర్య సాధనం కూడా. అందుకే కాస్మెటిక్‌ క్రీముల్లోనూ దీన్ని విరివిగా వాడుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియాలో గుణాల వల్ల ఇది మొటిమలకు కూడా మందులా పనిచేస్తుంది.

Saffron Rose Biryani

పుత్తడితో తులతూగే కుంకుమపువ్వులో నిజంగానే బంగారంలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కుంకుమపువ్వులో శాఫ్రనాల్‌, ఇతర గాఢతైలాలు ఉండటం వల్లే, కుంకుమపువ్వుకి ఆ వాసన వస్తుంది.

ఇఫా-క్రోసిన్‌, జియాక్సాంథిన్‌, లైకోసిన్‌, బీటాకెరోటిన్‌…వంటి కెరోటినాయిడ్ల వల్లే వీటికా రంగు వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల గుణాలున్న ఈ ఫైటోకెమికల్స్‌ అన్నీ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.

మూత్రపిండాలు, మూత్రాశయం, కాలేయ రుగ్మతలను తగ్గిస్తుంది. రక్తశుద్ధికీ తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తుంది. నెలసరిని క్రమబద్ధం చేస్తుంది. కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తుంది. కడుపులో నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఇది జీర్ణశక్తికి చాలా మంచిది. పేగు గోడలకు పూతలా అతుక్కుని ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీసెప్టిక్‌, యాంటీ డిఫ్రసెంట్‌గానూ పనిచేస్తుంది.

పడుకునే ముందు చిటికెడు కుంకుమపువ్వుని పాలల్లో కలుపుకుని తాగి పడుకుంటే నిద్రలేమి తగ్గుతుంది. ఫలితంగా డిప్రెషన్‌ వంటివి కూడా తగ్గుతాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/