అందంగా అమరేలా హెడ్‌సెట్‌

వస్తువుల వాడకం తీరు

bluetooth headphones
bluetooth headphones

ఎక్కువగా ఫోన్‌ వాడేవాళ్లు.. మ్యూజిక్‌ ప్రియులు ఆలోచించేది రెండే రెండు. ఇయర్‌ ఫోన్‌ ఏది మంచిది;? ఏ హెడ్‌సెట్‌ వాడొచ్చు? అందుకే ఇవి.. బడ్డెట్‌లో మెడపై నెక్లెస్‌లా వాలిపోయి చెవుల్లో చక్కగా ఒదిగిపోతాయి. హెచ్‌డి క్వాలిటీతో.. ఫోన్‌ మాట్లాడటంతో పాటు హెచ్‌డి స్టీరియో క్వాలిటీతో మ్యూజిక్‌ వినొచ్చు.

తక్కువ బరువుతో మెడకు చుట్టుకుని ట్రెండీగా కనిపిస్తుంది. వినసొంపైన బాస్‌, ట్రిబుల్‌ దీంట్లో ప్రత్యేకం. బిల్ట్‌ఇన్‌గా ఏర్పాటు చేసిన మైక్‌తో మీరు మాటలు అవతలి కాలర్‌కి స్పష్టంగా వినిపిస్తాయి. బ్లూటూత్‌తో ఫోన్‌కి కనెక్టుచేసి 30 అడుగులు పరిధిలో వాడుకోవచ్చు.

ఒక్కసారి చార్జ్‌చేస్తే 10 గంటలు పనిచేస్తుంది. ఒకేసారి రెండు ఫోన్‌లకు ఇయర్‌ఫోన్‌ని అనుసంధానం చేయొచ్చు (డ్యుయల్‌ పెయిరింగ్‌). అవసరం లేనప్పుడు ఇయర్‌ఫోన్‌లు లోపల ఉన్న అయస్కాంతంతోరెండు అతుక్కుంటాయి.

దీంతో మెడపై ఎలాంటి అసౌకర్యం కలగదు. ఒకే ఒక్క బటన్‌ని నొక్కితే చాలా. ఫోన్‌తో జతకట్టేస్తుంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/