పొదుపు చేయాలంటే

డబ్బు మిగిల్చుకోవటానికి అలవాటు పడాలి

Savings
Savings

సాధారణంగా మనం ఎంత ఎక్కువగా సంపాదించినా సరే నెలాఖరు సమయంలో మాత్రం ఖర్చు పెట్టడానికే ఎక్కువ డబ్బు మిగలదు .

అందుకే పొదుపు చేయాలని ప్రయత్నిస్తుంటాం.

కానీ అది సాధ్యం కాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి కష్టసమయాల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌, డిస్కౌంట్‌ సేల్స్‌, నచ్చి హోటల్స్‌ వంటి వాటిపై మనకున్న డబ్బంతా ఖర్చు చేస్తే పరిస్థితి దారుణంగా తయారవుతుంది.

అత్యవస పరిస్థితుల్లో డబ్బు మిగలదు. నెలాఖరులో అది కొనకుండా ఉంటే బాగుండేది ఇది తీసుకోకుండా ఉంటే బాగుండేది అంటూ మనల్ని మనమే తిట్టుకుంటాం, నిందించుకుంటుంటాం.

ఒక సర్వే ప్రకారం మనదేశంలో పొదుపు చేసే వారు తక్కువ. అందుకే డబ్బు మిగుల్చుకుని పొదుపు చేయటానికి అలవాటు పడాలి.

పొదుపు చేయాలంటే
Savings

అందుకు రోజువారీ అలవాట్లలో మార్పులు చేసుకునే ప్రయత్నం చేయాలి.

పొదుపు చేయడం ఎలాగో చెప్పడంతో పాటు మన నెలవారీ ఖర్చులను, పొదుపు చేసిన మొత్తాన్ని చూపిస్తూ ఖర్చులు తగ్గించుకోవడం మనకు సులవయ్యేలా చేస్తేందుకు ప్రస్తుతం చాలా యాప్స్‌ ఉన్నాయి.

మరికొన్ని యాప్స్‌ హోటల్‌ ఫుడ్‌పై ఆఫర్లు, డాల్స్‌ అందిస్తాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే కొద్దిగా డబ్బు మిగులుతుంది.

పొదుపు చేయాలంటే
Savings

అయితే లగ్జరీలకు పెట్టే మొత్తాన్ని తగ్గిస్తేనే పొదుపు చేయడానికి డబ్బు మిగులుతుందని తెలుసుకోవాలి.

అందుకే బయట భోజనం వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. కరోనా సమయంలో బయట తిండి అస్సలు మంచిదికాదు.

దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బు కూడా వృధా అవుతుంది. ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఆకలిగా అనిపించకోగా జంక్‌ ఫుడ్‌ తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. పాత వస్తువులను కొత్తగా చేసుకోవడం వల్ల చాలా వరకు ఖర్చులు తగ్గించుకోవచ్చు.

పొదుపు చేయాలంటే
Savings

చాలా మంది ఇంటిని డెకరేట్‌ చేయడానికి రకరకాల వస్తువులు కొంటూఉంటారు.

దీనికి బదులుగా ఉపయోగించిన సీసాలతో ఫ్లవర్‌వాజ్‌లు, ఐస్‌క్రీం పుల్లలతో అలంకరణ వస్తువులు, టిస్యూపేపర్లు, ప్లాస్టిక్‌ కవర్లతో పువ్వులు వంటివి తయారు చేసుకోవచ్చు.

ఇలా డెకరేటివ్‌ వస్తువులు ఎన్నో తయారు చేసుకోవచ్చు. దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది. నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అయితే నడక అంటే ఉదయం, సాయంత్రం చేయాల్సిన అవసరం లేదు.

వీలున్నప్పుడల్లా నడిచేయడం మంచిదే. ఒక్కోసారి తక్కువ దూరాలకు కూడా మనం ఆటోలు, క్యాబ్‌లు తీసుకుంటూ ఉంటాం.

స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ నడిచి వెళితే అటు ఆరోగ్యంతోపాటు ఇటు డబ్బు కూడా ఆదా అవుతుంది.

ఆ మొత్తాన్ని వేరే వాటికి ఉపయోగించకుండా పొదుపు చేయడం కోసం ఓ డబ్బాలో దాచి ఉంచుకోవచ్చు.

ఏదైనా అలవాటు మానుకోవాలనుకుంటే అలవాటు మానడం వల్ల వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగానే కాదు ఆర్ధికంగా కూడా ప్రయోజనం ఉండేలా ప్రయత్నం చేయండి.

ప్రతిసారి ఒక వంద రూపాయలను ఒక డబ్బాలో వేయాలి. జింక్‌ ఫుడ్‌ తిన్న ప్రతిసారి వంద రూపాలయను ఒక జార్‌లో వేయాలి.

ఇలా ఓ వారం రోజుల పాటు చేసిన తర్వాత అప్పటికీ అలవాటు మార్చుకోలేకపోతే ఈ మొత్తాన్నిరెట్టింపు చేయాలి.

ఆ మేరకు ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. తగ్గించిన ఖర్చులతో గడపడం కాస్త ఇబ్బందే కాబట్టి తొందరగానే ఆ అలవాటును మార్చుకుంటారు.

పొదుపు చేయడమంటే అస్సలు ఖర్చుపెట్టవద్దని కాదు. కాస్త ఆలోచించి తెలివిగా ఖర్చు చేయాలని అర్ధం.ఉదాహరణకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌లో డ్రెస్‌ నచ్చితే దాన్ని వెంటనే కొనేయకుండా కార్డ్‌లో వేసుకుని అలా ఉంచుకోవాలి.

కొన్నాళ్లకు ఏదైనా సేల్‌ ఉన్నప్పుడు అది మామూలు కంటే తక్కువ ధరకే లభిస్తుంది.

ఇంట్లో ఎసి ఆన్‌లో ఉన్నప్పుడు గాలి బయటకు పోవడం వల్ల అది మరింత పనిచేయాల్సి ఉంటుంది. దానివల్ల ఎలక్ట్రిసిటీ బిల్‌ కూడా పెరుగుతుంది.

అన్నీ తలుపులు, కిటికీలు మూయడం వల్ల గది తొందరగా చల్లారుతుంది. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అన్ని స్విచ్‌లు ఆపారా లేదా చెక్‌ చేయాలి.

ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చు. పొదుపు తర్వాతే ఖర్చు చేయాలి.

ఖర్చు పూర్తయిన తరువాత పొదుపు చేయడం చాలా మందికి అలవాటు.

కానీ ఇది తప్పు ముందు పొదుపు చేసేందుకు ఒకంత డబ్బు పక్కన పెట్టిన తర్వాత మాత్రమే ఖర్చులు చూసుకోవాలి.

సంపాదనలో కనీసం నలభైశాతం పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవచ్చు.

ఖర్చు కోసం బడ్జెట్‌ రాసుకుని పెట్టుకోవడం వల్ల అనవసరమైన ఖర్చులను అడ్డుకోవచ్చు.

ఇందులో ఒక ఇరవై శాతం అత్యవసర ఖర్చులను కూడా పెట్టుకోవడం అవసరం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/