మష్రూమ్‌ సూప్‌

Mushroom soup
Mushroom soup

ఈవినింగ్‌ స్నాక్‌గా మష్రూమ్‌ సూప్‌ తాగితే ఒళ్లంతా వెచ్చదనం నిండుతుంది. ఈ సూప్‌ ఎలా తయారు చేయాలంటే ….

సూప్‌కి కావాల్సినవి

బటన్‌ మష్రూమ్‌ -కప్పు
ఆలివ్‌ ఆయిల్‌ – టేబుల్‌ స్పూన్‌
బటర్‌ – టేబుల్‌ స్పూన్‌
తరిగిన అల్లం – టేబుల్‌ స్పూన్‌
సన్నగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి
మైదా పిండి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, పాలు (నల్లమిరియాలు కలిపినవి) – ఒకటిన్నర కప్పు
ముప్పావు కప్పు – ఫ్రెష్‌ క్రీమ్‌
ఉప్పు – తగినంత
వాము ఆకులు గార్నిష్‌ కోసం

తయారుచేయు విధానం

నాన్‌స్టిక్‌ పాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌, బట్టర్‌ను వేడి చేయాలి. తరిగిన అల్లం వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. వాము ఆకులు, మైదా పిండి వేసి బాగా కలిపి నిమిషం పాటు వేగించాలి. బటన్‌ మష్రూమ్స్‌, ఉప్పు వేసి మిక్స్‌ చేసి 5 నుంచి 6 నిమిషాలు ఉడికించాలి. మరిన్ని మష్రూమ్స్‌ వేసి, తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి కొద్దిసేపు మంటపై ఉంచాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేసి, పాలు పోసి రెండు నిమిషాలు మంటపై ఉంచాలి. ఇప్పుడు ఫ్రెష్‌క్రీమ్‌, మిరియాల పొడి చల్లాలి. వాము ఆకులతో గార్నిష్‌ చేస్తే వేడి వేడి మష్రూమ్‌ సూప్‌ రెడీ.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/