చంద్రబాబు వాటితో సంబంధం లేదని చెప్పడం లేదు?

యనమల ఏమైనా చంద్రబాబు ఆర్థిక లావాదేవీలు చూస్తున్నారా?

ummareddy venkateswarlu
ummareddy venkateswarlu

అమరావతి: టిడిపి అదినేత చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్తారని వైఎస్సార్‌సిపి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జోస్యం చెప్పారు. మాజీ సీఎం సహాయకుడి ఇంట్లో 5 రోజులు ఐటీ సోదాలు జరిగాయని, చంద్రబాబు, లోకేష్.. వాటితో సంబంధం లేదని చెప్పడం లేదని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ మౌనం అర్ధ అంగీకారంగా భావించాలన్నారు. చంద్రబాబుకి సంబంధం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారని, యనమల ఏమైనా చంద్రబాబు ఆర్థిక లావాదేవీలు చూస్తున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తీసుకున్న సైలెంట్ స్టాండ్ వల్ల అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. 26 డొల్ల కంపెనీల ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సామర్ధ్యం శ్రీనివాస్‌కు ఉందా అని నిలదీశారు. శ్రీనివాస్‌ పనిచేసింది చంద్రబాబు దగ్గర కాబట్టి అనుమానిస్తున్నామని ఉమ్మారెడ్డి చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/