చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?

ప్రతి విషయంలో సుదీర్ఘంగా ఉపాన్యాసాలు ఇస్తారు

ambati rambabu
ambati rambabu

అమరావతి: టిడిపి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తలపై ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ సుదీర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చే లక్షణం ఉన్న చంద్రబాబు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. ఈ పరిణామం గమనిస్తుంటే ఇందులో ఏదో తతంగం ఉందనిపిస్తోందని, ఇది చంద్రబాబు మీదికే రాబోతోందని స్పష్టంగా తెలుస్తోందని అంబటి స్పష్టం చేశారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్లకైనా ఇది అర్థమవుతుందని, చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే తేలుకుట్టిన దొంగ బాధను ఓర్చుకున్నట్టుగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.చంద్రబాబు మాజీ పీఎస్ నివాసంపై దాడుల్లో స్పష్టమైన ఆధారాలు దొరికాయని, రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని గుర్తించామని అధికారులు తెలిపినట్టు అంబటి వివరించారు. ఇదొక మనీ లాండరింగ్ వ్యవహారమని అధికారులు భావిస్తున్నారని పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/