అత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్

అత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్
Pawan Kalyan

పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు

‘అత్యాచారాలను అడ్డుకోగలగడమే నిజమైన రక్షాబంధన్. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు బాధ కలిగిస్తున్నాయి. గుంటూరు రమ్య హత్య, విజయనగరంలో రాములమ్మపై హత్యాయత్నం వంటి దుస్సంఘటనలు మనసును కలిచి వేస్తున్నాయి. ఆడపిల్లలంతా మన అక్కాచెల్లెళ్లు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. ఆడపడుచులు నిర్భయంగా తిరిగేలా భరోసా ఇవ్వాలి. భారతీయుల బాంధవ్యాలను చాటిచెప్పే వేడుకే రక్షాబంధన్. దేశం బలంగా ఉండాలంటే కుటుంబాలు సమైక్యంగా ఉండాలి’