నోబెల్ విజేతల ‘ప్రతిభ’ మనదేశంలో లేదా?
నేడు జాతీయ సైన్స్ దినోత్సవం

ప్రతిభను ప్రోత్సహించే వ్యవస్థ మన దేశంలో లేదని నోబెల్ వంటి పురస్కారాలు వ్యక్తులకు నేరుగా దక్కేవి కావని వ్యవస్థ సహకరించే పరిస్థితి ఉన్నప్పుడే పరిశోధనలు అద్భుతంగా సాగుతాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ఇండియన్ అమెరికన్ ఎకానమిస్ట్ అయిన బెనర్జీ ఒకవేళ తాను అమెరికా వెళ్లకుండా ఇండియాలో ఉంటే ఎప్పటికీ నోబెల్ వచ్చేదే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లాండ్ నుంచి ఇండియా వైపు మెడిటేరియన్ సముద్రజలాలలో ప్రయాణపు 1921 నాటి రోజులవి. గ్లాస్లో నీళ్లకు లేని రంగు సముద్ర జలాలకు ఎందుకు వచ్చింది? అప్పటికే కలకత్తా యూనివర్సిటీ ప్రొఫెసర్ సివిరామన్ యువ శాస్త్రీయ మేధావికి ఇంగ్లాండ్ షిప్ ప్రయాణంలో సందేహంవచ్చింది. ఆ కాలంలో శాస్త్రజ్ఞులు సముద్ర జలాల నీలిరంగుకు కారణం, ఆకాశ రంగు ప్రతిఫలిం చటంగా విశ్వసించేవారు. వైజ్ఞానిక ప్రపంచాన్ని, కాంతి కిరణాలపై రామన్ పరిశోధనల శాస్త్రీయ మేధాసంపన్నత అబ్బురపరిచింది. 1928 ఫిబ్రవరి28న రామన్ ఎఫెక్ట్ వెలుగు చూసింది.
వైజ్ఞానిక ప్రపం చంలో సంచలనం కలిగించిన సివి రామన్ శాస్త్రీయ పరిశోధనా మేధస్సుకు 1930లో ఆసియాలో ప్రప్రథమంగా నోబెల్ అవార్డు వరించింది. 1986లో భారత ప్రభుత్వాన్ని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్.సి.ఎస్. టిసి),రామన్ ఎఫెక్ట్ వెలుగు చూసిన ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ సైన్స్ దినో త్సవంగా గుర్తించవలసినదిగా సూచించింది. జాతీయ సైన్స్ దినో త్సవం ఈ సంవత్సరం ‘సైన్స్‌లో మహిళలు ఇతివృత్తంగా నిర్వ హించబడుతోంది.
సైన్స్పట్ల యువతలో ఆసక్తి అభిరుచి పెం పొందింపచేయటం, నిత్య జీవన విధానాలలో సైన్స్ ప్రాధాన్యతకు ప్రచారం,దినోత్సవ సందర్భంలో వర్క్‌షాప్‌లు,ప్రసంగాలు, ప్రదర్శ నలు, సైన్స్సంబంధిత చిత్రాలు, సెమినార్లు,చర్చలు నిర్వహించ బడుతున్నాయి.
పాఠశాలలో బాలబాలికలకు క్విజ్లు, వివిధ సైన్స్ ప్రాజెక్టులు,పోటీలు శాస్త్రీయవిజ్ఞానాన్ని అభివృద్ధిచేసే లక్ష్యం కొన సాగుతోంది. శాస్త్రీయ దృక్పథాన్ని బాలబాలికలలో, యువతలో పెంపొందింప చేసే జిజ్ఞాస ఆశయంగా శాస్త్రీయ సాంకేతిక విద్యా విధానాలు, నైపుణ్యత పెంపుదల, శిక్షణ, పరిశోధనలు మరింత కొనసాగించవలసి ఉంది.
స్వాతంత్య్రానంతరం దేశం ఎదుర్కొన్న తిండి గింజల కొరత వ్యవసాయశాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా అధిక దిగుబడుల బాటపట్టింది.ప్రస్తుత దేశ జనాభాకు పుష్కలంగాతిండి గింజలు అందుబాటులో లభ్యమవట మే కాకుండా ఎగుమతులు చేయగలుగుతున్నాం.అణుశక్తి, రక్షణరంగం,అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన రీసెర్చి అండ్ డెవలప్మెంట్కు 58శాతం నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం యూనివర్సిటీలు, కళాశాలలను కేవలం బోధనా సంస్థలుగానే పరిగణిస్తూ యువతరానికి శాస్త్రీయ కల్పనాత్మక పరిశోధనా రంగానికి ప్రోత్సాహం ఇవ్వటం లేదు.
జాతి ప్రగతి సాధనలో శాస్త్రీయ వికాసం

పపంచ మానవాళి ఎదుర్కొంటున్న ఆకలి, అనారోగ్యం, దారిద్య్రం వంటి మౌలిక అరిష్టాలను పారద్రోలగల అపారశక్తి, విజయవంతమైన జ్ఞానం శాస్త్రీయ పరిశోధనలు సాధించగలవ్ఞ అన్నారు 1947లో సర్ సి.వి.రామన్. 2030 నాటికైనా ఇండియా ప్రపంచంలో సైన్స్ పవర్ హౌస్‌గా రూపొందగలదనే ఆశాభావాన్ని మరొక నోబెల్ విజేత, ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ అధ్యక్షుడు ప్రొII వెంకటరామన్ రామకృష్ణన్ ఇటీవల వ్యక్తీకరించారు.
అద్భుత ప్రతిభావంతులు ఉన్నప్పటికీ భారతదేశం శాస్త్రీయ రంగంలో ప్రపంచాన్ని శాసించే స్థానంలో లేకపోవడంపై పలువ్ఞరు ప్రతిభావంతులైన శాస్త్రజ్ఞులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిభను ప్రోత్సాహించే వ్యవస్థ మన దేశంలో లేదని నోబెల్ వంటి పుర స్కారాలు వ్యక్తులకు నేరుగా దక్కేవికావని వ్యవస్థ సహకరించే పరి స్థితి ఉన్నప్పుడే పరిశోధనలు అద్భుతంగా సాగుతాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కారగ్రహీత అభిజిత్‌బెనర్జీ అన్నారు.
ఇండియన్ అమెరికన్ ఎకానమిస్ట్ అయిన బెనర్జీఒకవేళ తాను అమెరికా వెళ్లకుండా ఇండియాలో వ్ఞంటే ఎప్పటికీ నోబెల్ వచ్చేదే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబాయిలో 1961లో జన్మించిన అభిజిత్ బెనర్జీ కలకత్తా, జెఎన్‌యు, హార్వర్డ్, కేంబ్రిడ్జి యూనివ ర్సిటీలలో అభ్యసించి ప్రస్తుతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనమిక్స్‌లో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫె సర్గా పేదరికం నిర్మూలనకోసం చేసిన కృషికి నోబెల్ పురస్కారం పొందారు.
2009 నోబెల్ విజేత వెంకట్రామకృష్ణన్ 2016లో 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొంటూ ఇండియన్‌సైన్స్ ఒక సర్కస్ అంటూ వ్యాఖ్యానించారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యులర్ బయోలజీ ప్రఖ్యాత బయోలజిస్ట్ డాII పి.ఎమ్. భార్గవ సైన్స్ కాంగ్రెస్ క్షీణిస్తున్న విలువలున్న సంస్థగా దిగజారిందనీ, వార్షిక సమావేశాల నిర్వహణ వృధా వ్యయం అని వ్యాఖ్యానించారు.
మరొక నోబెల్ విజేత అమర్త్యసేన్ పలు సందర్భాలలో ఆర్థిక శాస్త్రరీత్యా ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. శతాబ్దిపైగా చరిత్ర కలిగిన ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశాలు దేశ విదేశ భారతీయ శాస్త్రజ్ఞులకు, దేశంలోని యువ పరిశోధనా శాస్త్రరంగానికి, దేశంలోని పెంపొందింపవలసిన శాస్త్రీయ దృక్పథానికి ప్రోత్సాహకరంగా లేని మాట వాస్తవం.
ప్రాచీన మహర్షుల విజ్ఞ్ఞాన సంపన్నత
జాతీయాభివృద్ధి కోసం శాస్త్రసాంకేతికం ప్రధాన ఇతివృత్తంగా 2017లో తిరుపతిలో జాతీయ సైన్స్‌కాంగ్రెస్ సమ్మేళనంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు,సివిరామన్ సైన్స్‌లో నోబెల్ సాధించిన ఘనత 86 సంవత్సరాలు పైబడిన ప్రస్తావన గుర్తు చేశారు. మళ్లీ ఆ కీర్తి ప్రతిష్టలు లభింపచేసిన శాస్త్రవేత్తకు రూ.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బహూకరిస్తుందని ప్రకటించారు.
నోబెల్ సాధించడం ఒక ఉన్నతలక్ష్యం. ప్రాథమిక విద్యాస్థాయి నుంచి బాలబాలికలలో సైన్స్పట్ల ఆసక్తి,అవగాహన, వారి ప్రతిభ వెలుగుచూసే ప్రోత్సా హం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి. ప్రతీ పాఠశాలలో అధునాతన ప్రయోగశాలలు,పరిశోధనా కేంద్రాలు నెలకొల్పి ఉన్నత విద్యాస్థాయిలో పరిశోధనారంగానికి నిధులుకేటాయించాలి.
ప్రాచీన కాలం నాటి మతవిశ్వాసాలతో,21వశతాబ్దం నాటి విజయాలను పోల్చిచూసి,19-21 శతాబ్దపు శాస్త్రీయపరిశోధనల మేధస్సును కించపరచడానికి స్వస్తి చెప్పాలి. సైన్స్ యూనివర్సల్ అయితే విశ్వాసం పూర్తిగా వ్యక్తిగతం.ప్రాచీన ఘనకీర్తిని గుర్తు చేసుకోవడం లో తప్పులేదు.కానీ అశాస్త్రీయ మూఢవిశ్వాసాలను, సైన్స్‌కి ముడి పెట్టడం భావ్యంకాదు.శాస్త్రరంగంలోని శాస్త్రజ్ఞులు సైన్స్ఈజ్ గాడ్ గా శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి.
మతం కేవలంవ్యక్తిగతమై నదిగా ఆరాధ్యనీయమే. కానీ దైవత్వాన్ని సైన్స్‌లోకి చొప్పించడం సరికాదు.నేర్చుకోవడం,నేర్పటం (లెర్నింగ్ అండ్ టీచింగ్)సైన్స్ ప్రగతికి పరిశోధన జ్ఞానం(రీసెర్చిఅండ్నాలెడ్జ్) కీలకమైనవి. నోబెల్ విజేత అమర్త్యసేన్ భారతీయ ప్రాచీన గణిత వైదుష్య ప్రతిభను ప్రశంసిస్తూ, అదేవిధంగా పాశ్చాత్య శాస్త్రీయ విజ్ఞాన ప్రగతి లేనిదే భారతీయ వైజ్ఞానిక పరిశోధన లేదన్నారు.
ప్రాచీన మహర్షుల జ్ఞాన సంపన్నతకు శిరస్సువంచి ప్రణమిల్లటం జాతిసంప్రదాయఔన్న త్య గౌరవప్రతిష్ఠలకు ఆరాధించడమే.వేద కాలంనాటి మహాత్మ్య మహర్షులు వైమానిక,ఖగోళ,లోహ,గణిత,జ్యోతిష్య తదితర శాస్త్రా లలో సాధించిన అద్భుత విజయాల ప్రాతిపదిక,పునాదులనుప్రస్తా వించడం, ప్రశంసించడం, సంభావించ డమే ప్రస్తుత రాజకీయాల కర్తవ్యంకాదు.బౌధాయన,అపస్తంభ,శుశ్రుత,చరక,బ్రహ్మగుప్త, ఆర్య భట,వరాహమిత్ర,భాస్కర,పతంజలి వంటి ఆర్షమహర్షులుతపఃసం పన్నులు ప్రపంచానికే మహోన్నత మార్గదర్శకంగా జ్ఞాన జ్యోతి ప్రసరింపచేశారు.
అందులో సందేహించవలసిన అగత్యం లేదు. ప్రస్తుతం మనదేశంలోని శాస్త్రజ్ఞులు నిశ్శబ్ద మౌనంతోకొందరు, ప్రయోజనాల పరిశోధనలు కొనసాగించే నిధుల సంతృప్తితో కొం దరు, ప్రాచీనజ్ఞానతత్త్వ ప్రచారవేత్తలుగా కొందరు, స్వార్థప్రయోజ నాల ఆకాంక్షలతో కొందరు సైన్స్ టెక్నాలజీ రంగ ప్రాధాన్యతను గాలికొదిలేసి వ్యవహరిస్తున్నారు. శాస్త్రీయ విజయాల సాధనలో కూడా దైవ విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
సుప్రీం పూర్వపు న్యాయాధీశులు జస్టిస్ ఎమ్.ఎస్. వెంకటచలయ్య తిరువనంత పురం ఫౌండేషన్సమావేశంలో దేశంలోని కార్పొరేట్ బడాసంస్థలు, సైంటిఫిక్ దృక్పథాన్ని ప్రోత్సాహించడానికి కోట్లాదిగా నిధులు విని యోగించాలని సూచించారు.సైన్స్‌కాంగ్రెస్ వేదికను రాజకీయ భావ ప్రచార పటిష్టతకు మార్చుకొనే ఆలోచనలు సాంవత్సరిక సదస్సు లలో పొడచూపుతున్నాయి.సైన్స్‌కి మతానికి సంఘర్షణ అనాదిగా వ్ఞన్నదే అయినా శాస్త్రీయ దృక్పథాన్ని దైవవిశ్వాసం కబళించే వాతావరణం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.
భారతీయ శాస్త్రీ య ప్రతిభావంతమై యువమేధస్సు,దేశంలో అవకాశాలు,గుర్తింపు లేక విదేశాలకు తరలిపోతోంది. విదేశీ పౌరసత్వాలు స్వీకరించి ఆయా దేశపౌరులుగా నోబెల్ అవార్డులు పొందుతున్నారు.
1995 లో ఢిల్లీమహానగరంలో విగ్రహాలు పాలు తాగిన మాస్‌హిస్టీరియా, ప్రబలిన సందర్భంలో ఒక మహిళా యువన్యాయశాస్త్రవేత్త పాలకు బదులుగా ఒక విగ్రహానికి లిక్కర్ పోసి ప్రయోగ పూర్వకంగా శాస్త్రీయ విజ్ఞాన దృష్టితో జనం కళ్లు తెరిపించారు. రీజన్, లాజిక్, ఫ్రూఫ్, ఎవిడెన్స్ సైన్స్‌కు ప్రధాన లక్షణాలుగా సైన్స్ ఈజ్ గాడ్‌గా సైన్స్‌ను ఆరాధించేవాళ్లు ప్రపంచమంతటా ఉన్నారు.
- జయసూర్య, సీనియర్ జర్నలిస్టు
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/