ప్రజావాక్కు: సమస్యలపై ప్రజాగళం

Voice of the people

సంక్షోభంలో వ్యవసాయరంగం: -సి. ప్రతాప్‌, శ్రీకాకుళం

నానాటికీ దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపో తున్న నేపథ్యంలో రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని 2016లో జాతీయ వ్యవసాయ సదస్సులో ప్రధాని ప్రకటించారు.అందుకోసం సమగ్రవ్యవసాయ విధానాన్ని అమ లులోకి కేంద్రప్రభుత్వం తీసుకువచ్చింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, రుణాల మంజూరు, ఎగుమతి విధానాలను రూపొందించుకోవాలన్న సదరు విధానం ఇంత వరకు సక్రమంగా అమలు కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు 12 రాష్ట్రాలు ఇంతవరకు విధివిధాన పత్రాలనే రూ పొందించలేదు.2016-19మధ్య ఆహారోత్పత్తుల ఎగుమతుల లో 15శాతం క్షీణత నమోదు అయినా ప్రభుత్వాలు స్పందించ డంలేదు. ప్రపంచ మార్కెట్‌లో భారతదేశం వాటా పెంచాలన్న లక్ష్యం ముందుకు పడడం లేదు. విధానాలకు విరుద్ధంగా రైతు ల ఆదాయంలో 21శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం.

వసతుల రూపకల్పనపై విమర్శలు:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలో ఫీజుల వసూలు, వసతు లు బోధన, లేబొరేటరీలు ఇతర వసతుల రూపకల్పనపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో సదుపాయాలు అం తంత మాత్రంగా ఉన్నాయి. ప్రయోగశాలలో సరైన పరికరాలు లేవ్ఞ. డిజిటల్‌ విద్య పేరిట లక్షల రూపాయలు ఖర్చు చేసినా అవిఅధికారుల నిర్లక్ష్యంకారణంగా పనిచేయడంలేదు. సిబ్బంది సరైన సమయానికి రావడం లేదు. దాదాపు అన్ని ప్రైవేట్‌ పాఠశాలలో రికార్డులలో పేర్కొన్న దానికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. మెజారిటీ పాఠశాలలో ఫీజుల ఖరారుకు సంబంధించి గవర్నింగ్‌ బాడీలు లేవ్ఞ. ఫీజుల వివరాలను పాఠశాల నోటీస్‌బోర్డులో పెట్టడంలేదు.పాఠశాలలో నియమిత వేళలకంటే 2-3గంటలు ఎక్కువగాక్లాసులు నిర్వహిస్తూ విద్యా ర్థులలో శారీరక, మానసిక, ఒత్తిళ్లకు కారణమవుతున్నారు.

బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

రెండువేల తొమ్మిది సంవత్సరంలో తుంగభద్ర నదికి వచ్చిన వరదలకు నాగలదిన్నె బ్రిడ్జి పూర్తిగా కూలిపోయినది. ఈ బ్రిడ్జి కూలినప్పటి నుంచి మూడుసార్లు ప్రభుత్వాలు మారినా బ్రిడ్జి పనులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. నాగలదిన్నె బ్రిడ్జి పూర్తి అయితే ఎమ్మిగనూర్‌, ఆదోని, మంత్రాలయం, బళ్లారి లాంటి ప్రాంతా లకు ప్రయాణదూరం తగ్గుతుంది.

పెరుగుతున్న వాయుకాలుష్యం:-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా

ఉత్తరభారతదేశ రాష్ట్రంలో పంటలు తగులబెట్టడంతో అలుము కున్న విషవాయువ్ఞలు ప్రజల శ్వాసకోశాలను పూర్తిగా కబళిం చకమునుపే నివారణ చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థ ప్రభుత్వానికి అందించిన నివేదికచూస్తే ప్రజా రోగ్యంపై ప్రభుత్వాలకు ఎంత చిన్నచూపు ఉందో తెలుపకనే తెలుపుతోంది. మనదేశంలో ఏటా పది కోట్ల టన్నుల పంట వ్యర్థాలను తగులబెట్టి పరిసరప్రాంతాలను కలుషితం చేసి ప్రజలప్రాణాలతో ఆడుకుంటున్నారని, ఈ దహనకాండ ఆపాల ని సామాజికవేత్తలు సదరు ప్రజలు కాలుష్య మండలికి, ప్రభు త్వాలకు మొరపెడుతూనే ఉన్నా చెవిటి వాడి ముందు శంఖం ఊదినచందాన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టక రం. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల గాలి కాలుషితం కావడమేకాకుండా ఆ పంట భూమిలోని తేమను హరించి పం టలకు పనికివచ్చే వేలరకాల సూక్ష్మజీవ్ఞలు అంతరించిపోతాయ ని, తగులబెట్టే బదులు వ్యర్థాలను పొలాలలో కలియదున్నితే ఎరువ్ఞగా మార్చవచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలి: -కందగట్ల శ్రవణ్‌కుమార్‌, వరంగల్‌

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నుండి ప్రారంభం అయ్యే రైళ్లలో జనరల్‌ బోగీలు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ప్రయాణి కులు అవస్థలు పడుతున్నారు. ఆర్‌.టి.సి బస్సుల టికెట్‌ రేట్లు ఈ మధ్యకాలంలో పెంచడం వల్ల అధిక సంఖ్యలో ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గుచూపిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనే ఉన్న జనరల్‌ బోగీలో ప్రయాణికులు నిండిపో తున్నా సామర్థ్యానికి మించి టికెట్స్‌ జారీ చేయడం వలన ప్రయాణికులు నిలబడి తోపులాటలో అనేక ఇబ్బందులు పడు తున్నారు. ముఖ్యంగా స్త్రీలు,చిన్నపిల్లలు కూడా అవస్థలు పడు తున్నారు.కాబట్టి రైల్వేఅధికారులు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వెంటనే జనరల్‌ బోగీల సంఖ్యను పెంచాలి.

ఆర్భాటాలతో ఆదాయం వృధా: -గరిమెళ్ల భారతీ దేవి, ఏలూరు, ప.గోజిల్లా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పేదరాష్ట్రం అంటున్న ముఖ్యమంత్రి ఏకంగా నలభైమంది సలహాదారులను నియమించుకోవడం, వారం దరికీ భారీ పారితోషికాలతో కేబినెట్‌ రాంకులు ఇవ్వడం, నిబం ధనల ప్రకారం వారికి ప్రత్యేక పేషీలు ఏర్పాటు చేసినట్లు అడ్వ కేట్‌ జనరల్‌ రాష్ట్రహైకోర్టుకు విన్నవించారు.అసలు 13 జిల్లాల పాలనకు మంత్రులు, శాఖాధిపతులు, ఆయా జిల్లాల అధికారు లు ఉండగా నలభైమంది సలహాదారులు, ఆపైన కేబినెట్‌ ర్యాం కులు, భారీ పారితోషికాలు ఈ పేద రాష్ట్రానికి అవసరమా?

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/