అమెరికాలో మ‌రోసారి కాల్పుల మోత .. ముగ్గురు మృతి

న్యూయార్క్: అమెరికాలో మ‌రోసారి కాల్పుల‌ క‌ల‌క‌లం రేగింది. అమెరికాలోని హ్యుస్ట‌న్ మార్కెట్‌లో ఓ దుండ‌గుడు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. బ‌హిరంగ మార్కెట్‌లో కాల్పులు జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే రెండు గ్రూపుల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణ‌మే కాల్పుల‌కు దారి తీసింద‌ని పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌కు సంబంధించి ఇద్ద‌రు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని, వారిద్ద‌రి నుంచి రెండు తుపాకుల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. కాల్పులు జ‌రిపిన‌వారు, గాయ‌ప‌డ్డ‌వారు అంద‌రూ 20 ఏండ్ల‌లోపు వార‌ని పోలీసులు తెలిపారు.

కాగా, ద‌క్షిణ కాలిఫోర్నియాలోని ఓ చ‌ర్చిలో దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో ఒక‌రు మృతి చెంద‌గా, మరో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘ‌ట‌న కేసులో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/