బ్యాంకులకు అలాంటి సూచనలేమీ ఇవ్వలేదు

రూ. 2 వేల నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయి

no-instruction-banks-withdrawing-rs-2000-notes-nirmala-sitharaman
no-instruction-banks-withdrawing-rs-2000-notes-nirmala-sitharaman

న్యూఢిల్లీ: దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను కేంద్రం గతంలో రద్దు చేసినట్టుగానే తాజాగా రూ. 2వేల నోట్లను కూడా ఉపసంహరించుకోనుందని వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. రూ. 2వేల నోట్ల జారీని నిలిపివేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఆమె స్పష్టం చేశారు. బుధవారం వివిధ ప్రభుత్వ బ్యాంకుల కీలక అధికారులతో సమావేశమైన నిర్మలా సీతారామన్‌ ఈ వివరణ ఇచ్చారు. తనకు తెలిసినంతవరకు, బ్యాంకులకు అలాంటి సూచనలేమీ ఇవ్వలేదంటూ తాజా పుకార్లను కొట్టి పారేశారు. రూ.2 వేల రూపాయల విలువైన నోట్లు చట్టబద్ధంగా చలామణిలో వుంటాయని, ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని నిర్మలా సీతారామన్‌ సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/