చంద్రబాబు కాన్వాయిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి

కాన్వాయి ముందు పడుకున్న వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు

chandrababu
chandrababu

విశాఖ: టిడిపి అధినేత చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్న సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల తీరుతో చంద్రబాబు కాన్వాయి ముందుకు కదిలే పరిస్థితి కనపడలేదు. దాదాపు రెండు గంటల పాటుగా ఆయన కాన్వాయిలోనే నిరీక్షించారు. వేలాదిగా వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి కార్యకర్తలు విమానాశ్రయ ప్రాంతానికి తరలివచ్చారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగింది.వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు చంద్రబాబు వాహనంపై కోడిగుడ్లు, చెప్పులు, టమాటాలతో విసిరారు. కొందరు చెప్పులు చూపెడుతూ నినాదాలు చేశారు. చంద్రబాబు కాన్వాయికి కొందరు వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు. అది ముందుకు కదలకపోతుండడంతో వాహనం దిగిన చంద్రబాబు నడుచుకుంటూ ముందుకు కదిలారు. అనంతరం మళ్లీ వాహనంలోకి ఎక్కారు. ఆయన కాన్వాయ్‌ మెల్లిగా ముందుకు కదులుతోంది. ప్రజా చైతన్య యాత్ర చేపట్టి తీరుతామని టిడిపి నేతలు అంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/