కరోనా ఎఫెక్ట్ : అజిత్ ‘ వలీమై’ వాయిదా

కరోనా దెబ్బ మరోసారి చిత్రసీమ ఫై భారీగా పడింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడం , రిలీజ్ లు ఆగిపోవడం జరిగింది. అంత సెట్ అయ్యిందని అనుకున్నారో లేదో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతుంది. దీంతో అనేక దేశాలు వీకెండ్ లాక్ డౌన్ , రాత్రి కర్ఫ్యూ , 50 % థియేటర్స్ కెపాసిటీ వంటి పలు ఆంక్షలు విధించారు. దీంతో పలు పాన్ ఇండియా మూవీ తో పాటు పెద్ద చిత్రాల రిలీజ్ లకు బ్రేక్ పడుతుంది. తెలుగులో ఆర్ఆర్ఆర్ , భీమ్లా నాయక్ , సర్కారు వారి పాటు , రాధే శ్యామ్ వంటి పెద్ద చిత్రాలు వాయిదాపడగా..తాజాగా తమిళ్ స్టార్ అజిత్ నటించిన ‘ వలీమై’ వాయిదా పడింది.సంక్రాంతి పండుగకు తమిళ, తెలుగు, హిందీ జనాలను అలరించేందుకు సిద్ధమైన వలిమై పోస్ట్ పోన్ అవ్వడం ‘తల (అజిత్)’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. భారీ బడ్జెట్ తో బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించాడు. వలిమైలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఈ మేరకు సన్నాహాలు కూడా మొదలు పెట్టేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూసి రిలీజ్ ను వాయిదా వేశారు.

‘‘ ప్రేక్షకులు, అభిమానులే సినిమాలకు బలం. కోవిడ్ కాలంలోను వీరందరూ సినిమాలపై ప్రేమను చూపించారు. అనేక ఒడుదొడుకులను తట్టుకుని ఈ సినిమా చిత్రీకరణ‌ను పూర్తి చేశాం. ఈ చిత్రాన్ని సినిమా హాళ్లల్లో విడుదల చేయాలని ప్రతి నిమిషం తపించాం. కానీ, పరిస్థితులు అనుకూలించడం లేవు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సినిమా థియేటర్లపై నిషేధం ఉంది. అందువల్ల పరిస్థితులు కుదుటపడేవరకు ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. థియేటర్లల్లో త్వరలో‌నే కలుస్తాం ’’ అని బోనీ కపూర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.