కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీశ్

బీహార్ సీఎం నితీశ్ కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఢిల్లీ లో బిజీ బిజీ గా గడిపిన నితీష్.. ‘సోనియా గాంధీ విదేశాల నుంచి రాగానే ఆమెను కలుస్తాను. అవసరమైతే మేం (ప్రతిపక్ష నేతలు) మళ్లీ కలుస్తాం. అందరి వైఖరి సానుకూలంగా ఉంది. మేం మెయిన్ ఫ్రంట్ కావాలనుకుంటున్నాం, మూడో ఫ్రంట్ కాదు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పనిని కొనసాగిస్తా.’’ అని తెలిపి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ..కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల బీహార్‌లో పర్యటించిన కేసీఆర్ అక్కడ చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు.కేంద్రంలో రొటీన్ ప్రభుత్వాలు వద్దని.. దేశాన్ని మార్చే ప్రభుత్వం రావాలని కేసీఆర్ అన్నారు. రోటీన్ ప్రభుత్వాలు అంటే.. కాంగ్రెస్ (యూపీఏ), బీజేపీ (ఎన్డీయే) అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలోనే.. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. 2024లో విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నితిశ్ కుమార్ పేరుపై అభిప్రాయాన్ని చెప్పాలని కేసీఆర్‌ను మీడియా ప్రతినిధులు అడిగ్గా.. దీనిపై స్పందించిన కేసీఆర్.. ‘ఇది చెప్పడానికి నేను ఎవరు? నేను సమాధానం ఇస్తే ఇతర పక్షాలు అభ్యంతరం చెప్పొచ్చు. మీరెందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? అని బదులు ఇచ్చారు.

తాజాగా ఇప్పుడు నితీశ్ చేసిన కామెంట్స్..కేసీఆర్ కు షాక్ ఇచ్చేలా ఉందని..దీనిని బీజేపీ ఆయుధంగా మలుచుకొని , కేసీఆర్ ఫై విమర్శలు చేసే అవకాశం ఉందని అర్ధమవుతుంది. కేసీఆర్ బీహార్ వెళ్లివచ్చి వారం గడవకముందే.. నితీశ్ కుమార్ సోనియాగాంధీని కలుస్తానని.. తామే మెయిన్ ఫ్రంట్ కావాలనుకుంటున్నామని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.