హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి స్పందన

Nithin Interview Pics
Nithin Interview Pics

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి స్పందించారు. నితిన్‏కు అంత సీన్ లేదని.. కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తున్నారని.. టీవీల్లో వస్తున్న వార్తలను తాను నమ్మనని తేల్చి చెప్పారు.

‘ నేను ఆ వార్తను టీవీలోనే చూసాను. హీరో నితిన్‏కు అంత సీన్ లేదు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం అవాస్తవం. ఇవి సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న స్టెంట్స్‏లా ఉన్నాయి. అవి సినిమాల్లో పని చేస్తాయి తప్ప రాజకీయాల్లో కాదు. నితిన్‏ను అంత సీరియస్‏గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ప్రమోషన్ అనుకుంటున్నారు కాని అది సెట్ అవదు. సినిమాల్లో సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాము. ప్రజల్లో ఉన్న వారికే రాజకీయాలు వర్కవుట్ అవుతాయి. రూరల్‏లో ప్రజల్లో ఉన్న వారికే ప్రజలు పట్టం కడుతారు. నేను ఘర్ వాపసీ ద్వారానే మల్లి కాంగ్రెస్ లోకి వచ్చాను. మండవ నా గురువు లాంటి వారు. నా చేరిక చంద్రబాబు , మండవ ఇన్వాల్వ్ కాలేదు” అని తెలిపారు.

ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే.. వెంకీ కుడుములతో ఓ సినిమా , చంద్రశేఖర్ యేలేటి తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.