మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుండి డిలీట్ వీడియో రిలీజ్..ఈ సీన్ కానుకగా ఉంటె థియేటర్స్ లో అరుపులే

అక్కినేని నాగార్జున వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్..మొత్తానికి హిట్ కొట్టి అందర్నీ సంతోష పరిచాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ..దసరా సందర్భాంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజు మొదటి ఆట తోనే హిట్ టాక్ రావడం తో కలెక్షన్స్ కూడా కుమ్మేస్తున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో భాగంగా సినిమాలో డిలీట్ చేసిన పెళ్లిచూపులు సీన్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

ఈ డిలీట్ చేసిన వీడియోలో… అఖిల్… తన యాక్టింగ్ అదరగొట్టాడు. పెళ్లి చూపుల కోసం వెళ్లి… అమ్మాయి ను ఉరకంటి తో చూస్తూ..ఆమె ముందు షర్ట్ విప్పి.. రచ్చ చేస్తాడు. అయితే ఈ సీన్ ను సినిమాలో మొదట పెట్టాలని అనుకున్న చిత్రబృందం… కొన్ని కారణాల వల్ల డిలీట్ చేసింది. అయితే తాజాగా ఆ డిలీట్ చేసిన వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. ఈ వీడియో చూసిన వారంతా ఈ సీన్ పెట్టాల్సింది..థియేటర్స్ లో అరుపులే ఉండే అని కామెంట్స్ వేస్తున్నారు.