వరంగల్ సభలో మోడీ స్పీచ్ హైలైట్స్

ప్రధాని మోడీ నేడు వరంగల్ లో పర్యటించారు. రూ. 6,100 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీ..ఏంఐ ప్రత్యేక విమానం‌లో వరంగల్‌ మామునూరుకు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన భద్రకాళి అమ్మవారి దేవాలయం కు చేరుకున్నారు. ఆలయ అర్చకులు మోడీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి ఆలయం నుంచి విజయసంకల్ప సభకు వెళ్లారు.

సభా వేదికపైనుంచి రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేసారు. రూ. 521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యాను ఫాక్చరింగ్ యూనిట్ , జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఎన్-163జీ కి శ్రీకారం చుట్టారు. అలాగే రూ. 2,147 కోట్లతో జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ ఎన్‌హెచ్ పనులు , రూ. 3,441 కోట్లతో మంచిర్యాల – వరంగల్ ఎన్‌హెచ్ పనులకు శంకుస్థాపన చేసారు.

అనంతరం మోడీ తెలుగు లో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కల్పనకు ఎంతో కేంద్రం కృషి చేసింది. తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. తెలంగాణలో కనెక్టవిటి, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రూ. 6వేల కోట్లు ఖర్చు చేశాం. దేశం అభివృద్ధిలో తెలుగు వారి ప్రతిభ కీలకం.


దేశానికి ఇది స్వర్ణ సమయం. దేశాభివృద్ధికోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నాం. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్ – ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి. కరీంగనర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుంది. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నాం అని తెలిపారు.